
రేటు కొంతమేర ఎక్కువైనా మన దేశంలోని హిమాచల్ ప్రదేశ్ ప్రాంతం నుంచి యాపిల్స్ కొనుగోలు చేస్తామని చెబుతుండటం గమనార్హం. తుర్కియే న్యూస్ ఛానెల్ పై భారత్ నిషేధం విధించగా మన దేశ ఫిల్మ్ మేకర్స్ సైతం తుర్కియేను నిషేధించనున్నారని సమాచారం అందుతోంది. మైక్ మై ట్రిప్ సైతం టూరిజంలో భాగంగా తుర్కియేను ప్రమోట్ చేయాలని అనుకోవడం లేదని తెలుస్తోంది.
మన దేశం తుర్కియేను బాయ్ కాట్ చేయడం వల్ల ఆ దేశానికి 500 కోట్ల రూపాయలకు అటూఇటుగా నష్టం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. తుర్కియే మాత్రం మన దేశం బాయ్ కాట్ చేస్తున్నా పెద్దగా స్పందించడం లేదు. తమ మద్దతు పాకిస్తాన్ కే అని ఈ దేశం స్పష్టం చేస్తోంది. అయితే ఇప్పుడు సమస్య లేదు కానీ భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.
తుర్కియే అభివృద్ధికి సైతం రాబోయే రోజుల్లో ఆటంకాలు తప్పవని కామెంట్లు వినిపిస్తున్నాయి. తుర్కియే దేశానికి రాబోయే రోజుల్లో మరిన్ని షాకులిచ్చే దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు