
'స్పిరిట్' మూవీకి మొదట హీరోయిన్‌గా దీపికా పదుకోనేను తీసుకున్నారు. అయితే, ఆమె కొన్ని డిమాండ్లతో చిత్రబృందాన్ని ఇబ్బంది పెట్టడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చాయి. దీపికా స్థానంలో మృణాల్ ఠాకూర్‌ను తీసుకోవాలని పలువురు అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ ట్రెండ్ చేశారు. రష్మిక, శ్రద్ధా కపూర్ లాంటి హీరోయిన్లు అయితే బాగా సెట్ అవుతారని అభిప్రాయపడుతున్నారు. మొదట మృణాల్ ఠాకూర్ పేరు తెరపైకి వచ్చినా.. ఆ బాధ్యత ఆమెకు ఇవ్వలేదని కన్‌ఫర్మ్ అయింది. తర్వాత రుక్మిణి వసంత్ పేరు వినిపించింది. ఎన్టీఆర్ ‘డ్రాగన్’ సినిమాలో నటిస్తున్న ఈ భామను 'స్పిరిట్'కు కూడా తీసుకున్నారనే ప్రచారం జరిగింది. కానీ దర్శకుడు సందీప్ వంగా స్పష్టంగా ఆమె కూడా చిత్రంలో లేరని తెలిపారు.
ఆఖరికి 'యానిమల్' చిత్రంలో బాబీ 2గా గుర్తింపు పొందిన త్రిప్తి డిమ్రీకి ఈ అవకాశం దక్కింది. రణబీర్ కపూర్‌తో బోల్డ్ పాత్రలో కనిపించిన త్రిప్తి, ‘యానిమల్’ రిలీజ్ తర్వాత హిందీ చిత్రసీమలో వరుస ఆఫర్లు దక్కించుకుంది. ఆ క్రేజ్ బేస్ మీదే ఆమెను ‘స్పిరిట్’కి ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. అయితే, ప్రభాస్ ఫ్యాన్స్ లో కొందరు త్రిప్తి ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు ప్రభాస్ సరసన కెమిస్ట్రీ కుదరదని, భారీ స్థాయి కమర్షియల్ సినిమాకు ఆమె ఫిట్ కాకపోవచ్చని భావిస్తున్నారు. అయితే, మరికొందరైతే త్రిప్తి నటన బాగుంటుందనీ.. ‘స్పిరిట్’లో ఆమె కొత్త తరహా క్యారెక్టర్ చేస్తారని ఆశపడుతున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా నటించనున్నాడు. సందీప్ వంగా ప్రకారం ఇది ఇప్పటివరకు ప్రభాస్‌ను ఎవరూ చూపించని విధంగా చూపించే డిఫరెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుంది. ప్రభాస్ పూర్తి సమయాన్ని ఈ సినిమాకే అంకితం చేయాలని, లుక్ కంటిన్యూయిటీ దృష్టిలో ఉంచుకుని వేరే సినిమాలు చేయకుండా ఉండాలని దర్శకుడు ఇప్పటికే కండిషన్లు పెట్టినట్టు సమాచారం. మొత్తంగా హీరోయిన్ ఎంపిక విషయంలో అభిమానుల్లో ఉన్న అభిప్రాయభేదాలు సహజం. కానీ దర్శకుడు చూసే విజన్, కథ డిమాండ్ చేసే క్యారెక్టర్‌కు త్రిప్తి సరిపోతుందన్న నమ్మకంతోనే ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఈ కాంబినేషన్ స్క్రీన్‌పై ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి!