తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నటుడుగా పీపుల్ స్టార్ గా పేరు పొందిన ఆర్.నారాయణమూర్తి సినీ ఇండస్ట్రీ బాగుకోసం ఎన్నో సందర్భాలలో మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇటీవలే గద్దర్ అవార్డులను కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడంతో అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇలాంటి అవార్డులను ప్రకటించాలి అంటూ నారాయణమూర్తి తెలియజేయడం జరిగింది. అలాగే థియేటర్ల బంద్ వ్యవహారం పైన కూడా నారాయణమూర్తి స్పందించారు. గద్దర్ అవార్డులు అందుకుంటున్న ప్రతి ఒక్కరికి తన అభినందనలు ఏపీలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు నంది అవార్డులను ప్రకటించాలి అంటూ వెల్లడించారు.


ఈమధ్య ఏపీలో థియేటర్లు బంద్ వ్యవహారం  హరిహర వీరమల్లు సినిమా కోసమే జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారనే విధంగా వార్తలు వినిపించాయి అవన్నీ అబద్ధం.. ముఖ్యంగా థియేటర్లలో పర్సంటేజ్ విషయం ఖరారు అయితే నాలాంటి నిర్మాతలకు చాలా మేలు జరుగుతుందని.. పవన్ కళ్యాణ్ వంటి హీరోల పైన ఎవరు కుట్రలు చేస్తారు.. కానీ పవన్ కళ్యాణ్ లాంటి నేత కార్యాలయం నుంచి అలాంటి ప్రకటన రావడం చాలా బాధగా ఉంది.. కేవలం తన సినిమా కోసమే కాకుండా సినీ పరిశ్రమలో ఉండేటువంటి సమస్యల పైన చర్చిద్దాం అంటూ పిలిచి ఉంటే గౌరవం మరింత పెరిగేదని తెలిపారు.

థియేటర్లు బంద్ అనేది కూడా ఒక బ్రహ్మాస్త్రం.. సింగిల్ థియేటర్లో ప్రస్తుతం ఉన్న రోజులలో మూత వేయవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటూ తెలిపారు. సినిమా థియేటర్లలో పర్సంటేజ్ విధానాన్ని కోరుకునే వ్యక్తులలో తాను కూడా ఒకరిని అంటూ తెలిపారు. ఈ విషయంపై చాంబర్ ముందు టెంట్ వేసి మరి ఆందోళన చేపట్టిన సందర్భాలు ఉన్నప్పటికీ..ఈ సమస్య పైన చాలామందికి విజ్ఞప్తి కూడా చేసాము కానీ ఇప్పటికీ పరిష్కారం కాలేదు.. పర్సెంటేజ్ ల విషయంలో ఒక కొలిక్కి వస్తున్న దశలో హరిహర వీరమల్లు సినిమాకి లింకు పెట్టడం సరైనది కాదు అంటూ తెలిపారు. ఏపీ ప్రభుత్వాన్ని కలవాలని చెప్పడంలో ఎలాంటి తప్పులేదు కానీ పర్సంటేజ్ విషయాన్ని పక్కదారి పట్టించొద్దండి అంటూ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: