నటసింహ నందమూరి బాలకృష్ణ,బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భారీ అంచనాల మధ్య ఇటీవలే ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన విషయం తెలిసిందే. కుంభమేళాలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించడంతో ఇక అంతా శుభమే అని అభిమానులు కూడా కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే భారీ అంచనాల మధ్య సినిమా అయితే రాబోతోంది కానీ ఇప్పటివరకు ఈ సినిమా నుండి ఎటువంటి అప్డేట్ వదలలేదు.

అభిమానులు ఈ సినిమా కోసం, ఈ సినిమా అప్డేట్ కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ఇక ఈరోజు ఉదయం ఊరిస్తూ 10:54  గంటలకు సినిమా అప్డేట్ వదులుతామని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక చెప్పినట్టుగానే తాజాగా ఈ సినిమాను నిర్మిస్తున్న 14 రీల్స్ ప్లస్ బ్యానర్ వారు అభిమానులకు గూస్బంస్ తెప్పించేలా ఒక అప్డేట్ వదిలారు. ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రేపు అనగా జూన్ 9 సాయంత్రం 6:03 గంటలకు అఖండ 2 టీజర్ను రిలీజ్ చేస్తామని ప్రకటించారు.  గాడ్ ఆఫ్ మోసెస్.. టీజర్ తాండవం షురూ అంటూ మేకర్స్ ప్రకటించారు.  అంతేకాదు ఇక్కడ ఒక త్రిశూలాన్ని పోస్టర్ రూపంలో పంచుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అఖండ 2 సినిమా విషయానికే వస్తే.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సీక్వెల్ గా రాబోతోంది. ఇందులో ప్రగ్యా జైస్వాల్ తో పాటు సంయుక్త మీనన్ కూడా హీరోయిన్గా నటిస్తోంది. ఎస్ తమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఒక భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఈ సినిమా. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడు టీజర్ అనౌన్స్మెంట్ అప్డేట్ ఇచ్చారు.  కాబట్టి రేపు ఈ విధ్వంసం ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: