- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .

తాజాగా అక్కినేని నవ మన్మధుడు అఖిల్ పెళ్లి తన ప్రియురాలు జైనాబ్ ర‌వ్జ్ దే తో జరిగింది. కొద్ది రోజుల క్రితం నాగార్జున తన పెద్ద కుమారుడు నాగచైతన్యకు హీరోయిన్ శోభిత దూళిపాళ్లతో పెళ్లి చేశారు. ఇక ఇప్పుడు తన రెండో కుమారుడు అఖిల్ పెళ్లి చేయడంతో నాగార్జున బాధ్యతలు తీరాయి. అక్కినేని ఫ్యామిలీలో చైతు మొదటి వివాహం సమంతతో విడాకులు వరకు వెళ్ళింది. ఎంతో ఇష్టంగా ప్రేమించుకుని నాలుగేళ్లకే విడిపోయారు. తర్వాత చైతు మరో హీరోయిన్ శోభిత తో ప్రేమలో పడడంతో ఏం జరుగుతుందో ? అన్న ఉత్కంఠ వ‌ర‌కు వెళ్లాక‌ పెళ్లి చేసుకున్నారు. ఇక అఖిల్ కి కూడా ముందుగా శ్రియ భూపాల్ తో ఎంగేజ్మెంట్ జరిగి పెళ్లి వరకు వెళ్లకుండానే బ్రేకప్ జరిగింది. ఇక ఇప్పుడు అఖిల్ పెళ్లాడిన జైనాబ్‌ అఖిల్ కన్నా 9 ఏళ్ళు వయసులో పెద్ద అట. వాళ్లది అల్లాటప్ప కుటుంబం కాదు.. చాలా హై ప్రొఫైల్ ఫ్యామిలీ.


అప్పుడెప్పుడో ఆమె మీనాక్షి అనే సినిమా చేసింది. అదొక్కటే సినిమా ఆమె గురించి నెట్ లో లభిస్తుంది. 2004లో సినిమా చేసింది .. అంటే ఇప్పటికీ ఆమె వయసు 39. అఖిల్ చేసుకోబోయే అమ్మాయి థియేట‌ర్‌ ఆర్టిస్టు. ఆమె తండ్రి జుల్ఫీ కూడా ఆర్టిస్ట్ కం బిజినెస్మేన్.. ! గతంలో ఈ ఫ్యామిలీకి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఓడియన్ థియేటర్ ఉండేది. ప్రస్తుతం ఆమె ముంబైలో ఉంటుంది. చాలా లో ప్రొఫైల్ .. ఎక్కువగా దుబాయ్ - లండన్ - ఇండియాల మధ్య తిరుగుతూ ఉంటుంది. అఖిల్‌తో ఆమెకు ఎలా పరిచయం అన్నది ? కూడా కాస్త సీక్రెట్ గా ఉంచారు. అంతకుమించి వివరాలు ఏమీ తెలియవు. ఇక జుల్పి గల్ఫ్ దేశాల్లో బిగ్ రియల్ ఎస్టేట్ టైకూన్‌. ఆయనకు రియల్ ఎస్టేట్ రంగంలో 30 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. అంతేకాదు ఆయన మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో సలహాదారుగా కూడా పనిచేశారని తెలుస్తోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: