సినిమా ఇండస్ట్రీ లో రూమర్స్ , గాసిప్స్ అనేవి సర్వసాధారణం. ఎవరైనా మంచి క్రేజ్ ఉన్న నటి నటులు పై గాసిప్స్ , రూమర్స్ రావడం సర్వసాధారణం. కొంత మంది నటీ నటులు వాటిని పట్టించుకుంటారు. మరి కొంత మంది సినిమా ఇండస్ట్రీ లో ఇలాంటివి సర్వసాధారణం అని వాటిని లైట్ తీసుకుంటూ ఉంటారు. ఇక రూమర్స్ మంచి క్రేజ్ ఉన్న సినిమా విషయంలో కూడా తరచుగా వస్తూ ఉంటాయి. ఏదైనా మంచి క్రేజ్ ఉన్న సినిమా విషయంలో రూమర్స్ పుట్టుక రావడం సర్వసాధారణం. చాలా కాలం నుండి ఓ సినిమా విషయంలో అనేక రూమర్స్ , గాసిప్స్ వస్తూనే ఉన్నాయి.

 కానీ ఆ మూవీ మాత్రం స్టార్ట్ కావడం లేదు. ఆ సినిమా ఏది అనుకుంటున్నారా ..? ఆ మూవీనే ఖైదీ 2. కొన్ని సంవత్సరాల క్రితం కార్తీ హీరోగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో ఖైదీ అనే సినిమా వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా చివరన ఈ మూవీ కి సీక్వెల్ ఉండబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ తర్వాత ఈ మూవీ హీరో , దర్శకుడు కూడా ఈ సినిమాకు సీక్వెల్ మరికొన్ని రోజుల్లోనే స్టార్ట్ కాబోతుంది అని చెప్పుకొచ్చారు. కానీ ఈ సినిమా సీక్వెల్ మాత్రం ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు. ఈ మూవీ షూటింగ్ అప్పటి నుండి ప్రారంభం కానుంది , ఇప్పటి నుండి ప్రారంభం కానిది అని అనేక వార్తలు బయటకు వచ్చాయి.

ఇకపోతే ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరు అయినటువంటి అనుష్క శెట్టి గ్యాంగ్ స్టార్ పాత్రలో కనిపించనున్నట్లు , ఈమె పాత్ర ఈ సినిమాకే హైలైట్ గా నిలవనున్నట్లు ఓ వార్త గత కొంత కాలంగా వైరల్ అవుతుంది. ఈ వార్తపై కూడా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇలా ఈ మూవీ పై మంచి క్రేజ్ ఉండడంతో ఈ సినిమాకు సంబంధించిన అనేక గాసిప్స్ పుట్టుకు వస్తున్నాయి అని చాలా మంది భావిస్తున్నారు. ఏదేమైనా కూడా ఈ మూవీ సీక్వెల్ పై ప్రేక్షకుల్లో అత్యంత భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: