
'సత్యం సుందరం'తో అలరించిన హీరో కార్తీ ఇప్పుడు విమర్శకుల ప్రశంసలు పొందిన తానక్కారన్ ఫేం డైరెక్టర్ తమిజ్ తో కలిసి తన 29వ చిత్రం కోసం చేతులు కలిపారు. ఈ ప్రాజెక్టును డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై SR ప్రకాష్ బాబు , SR ప్రభు నిర్మిస్తారు. ఇషాన్ సక్సేనా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కార్తీ ని ఇంటెన్స్ గా ప్రెజెంట్ చేసిన అద్భుతమైన పోస్టర్ తో మేకర్స్ ఈరోజు 'మార్షల్' అనే టైటిల్ ను రిలీజ్ చేశారు. ఈరోజు శుభ పూజా కార్యక్రమంతో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తోంది. కళ్యాణి తెలుగులో అఖిల్ హలో సినిమా తో సుపరిచితమే. తర్వాత సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమా లోనూ నటించింది.
ఇక ఈ మార్షల్ సినిమా లో సత్యరాజ్, ప్రభు, లాల్, జాన్ కొక్కెన్, ఈశ్వరి రావు, మురళీ శర్మ ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మార్షల్‌ను అత్యున్నత స్థాయి సాంకేతిక, నిర్మాణ విలువలతో భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ప్రఖ్యాత సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ కెమెరామెన్‌గా వ్యవహరిస్తుండగా, సంగీత సంచలనం సాయి అభ్యాంకర్ సంగీతం అందిస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్‌గా, అరుణ్ వెంజరమూడు ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.
ఎక్సయిటింగ్ టైటిల్ రివీల్‌తో మార్షల్ కార్తీ ఫిల్మోగ్రఫీకి మెమరబుల్ మూవీగా ఉంటుందని హామీ ఇచ్చారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు