హీరో నాగార్జున తమిళ డైరెక్టర్ రా కార్తీక్ డైరెక్షన్లో ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమానే నాగార్జున 100వ సినిమా కావడం గమనార్హం. అయితే చాలామంది దర్శకుల్ని పరిశీలించి మరి చివరికి తమిళ డైరెక్టర్ కార్తీకి అవకాశం ఇచ్చారు. దర్శకుడికి పెద్దగా అనుభవం లేకపోయినా కథ పైన ఉండే నమ్మకంతో నాగార్జున అవకాశం ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు ఈ సినిమా కథకు సంబంధించి ఎలాంటి విషయం కూడా బయటకు రాలేదు. ప్రస్తుతం అయితే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయట.



ఇలాంటి సమయంలోనే నాగార్జునాకు జోడిగా ఎవరనే విషయంపై వైరల్ గా మారడంతో తాజాగా హీరోయిన్ కత్రినా కైఫ్ పేరు తెరమీదికి వినిపించింది. ఇందులో హీరోయిన్గా కత్రినా కైఫ్ తీసుకోవాలని ఆలోచనతో చిత్ర బృందం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నాగార్జున సినిమాలకు భిన్నంగానే ఈ సినిమా ఉంటుందట. పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మార్కెట్ పరంగా కూడా కత్రినా కైఫ్ అయితే బాలీవుడ్ లో వర్క్ అవుట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

మరి ఈ అవకాశం పై కత్రినా కైఫ్ ఎలా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది. ఇప్పటికే కత్రినా కైఫ్ టాలీవుడ్లో పలు చిత్రాలలో కూడా నటించింది. ముఖ్యంగా మల్లేశ్వరి సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న కత్రినా కైఫ్ ఆ తర్వాత మళ్లీ తెలుగులో నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.బాలీవుడ్ లో మాత్రం స్టార్ హీరోయిన్గా కొనసాగింది. మరి ఇప్పుడు నాగార్జున నటిస్తున్న చిత్రంలో అవకాశం వస్తే మరి యాక్సెప్ట్ చేస్తుందా లేదా అన్న విషయం చూడాలి. బాలీవుడ్ తారలే తెలుగు సినిమాలలో అవకాశం కోసం దిగివస్తున్నారు ఇప్పటికే అలా దీపికా పదుకొనే, అలియా భట్ వంటి వారు కూడా తెలుగు చిత్రాల వైపు మక్కువ చూపుతున్నారు. మరి కత్రినా కైఫ్ ఏ విధంగా కం బ్యాక్ ఇస్తుందో చూడాలి

మరింత సమాచారం తెలుసుకోండి: