మరి ఇంతకీ బండ్ల గణేష్ చేసిన తప్పేంటి..ఎందుకు ఆయనపై విరుచుకుపడుతున్నారు అనేది చూస్తే.. కోట శ్రీనివాసరావు వృద్ధాప్యం కారణంగా గత కొద్ది రోజులుగా సినిమా షూటింగ్స్ లో పాల్గొనడం లేదు.అయితే హరిహర వీరమల్లు సినిమాలో ఓ చిన్న సీన్లో ఈయన కనిపిస్తారట. అయితే చాలా రోజుల నుండి కోట శ్రీనివాసరావు షూటింగ్స్ లో పాల్గొనక పోవడం వల్ల బయట కనిపించడం లేదు. దీంతో ఆయన ఎలా ఉన్నారో ఎవరికి తెలియదు.కానీ బండ్ల గణేష్ కోటా శ్రీనివాసరావు ఇంటికి వెళ్లి మరీ కలిసి ఆయనతో ఉన్న ఫోటోలు షేర్ చేసుకున్నారు. ఈ ఫోటోతో కోటా శ్రీనివాసరావు ఎలా ఉన్నారో చూసి చాలామంది షాక్ అయిపోయారు.
అయితే అలాంటి బండ్ల గణేష్ కోట శ్రీనివాస రావు చనిపోయిన సాయంత్రానికి ఆయన అంత్యక్రియలు ముగిశాక చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్నాను అంటూ ఒక షాకింగ్ పోస్ట్ పెట్టారు.అందులో ఉత్తేజ్,శ్రీకాంత్,శివాజీ రాజా, ఆలీతో కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు.దీంతో ఈ పోస్ట్ చూసిన చాలా మంది నెటిజన్లు అసలు బండ్ల గణేష్ కి దిమాక్ పని చేస్తుందా.. ఇండస్ట్రీలో ఉండే అంత పెద్ద మనిషి చనిపోతే ఇండస్ట్రీ మొత్తం ఆయన్ని తలుచుకొని బాధపడుతుంటే ఈయన మాత్రం ఫ్రెండ్స్ తో చిల్ అవుతున్నాను అంటూ పోస్ట్ పెడతారా.. అసలు ఈయనకి కోట శ్రీనివాసరావు అంటే కనీస మర్యాద కూడా లేదా.. అంటూ ఫైర్ అవుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి