
ఆమె సినీ పరిశ్రమకు దూరంగా, దేశానికి సేవ చేయాలన్న దృక్పథంతో భారత సైన్యంలో చేరింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో 1991 నవంబర్‌లో జన్మించిన ఖుష్బూ, చిన్ననాటి నుంచే ఆత్మవిశ్వాసం గల వ్యక్తిగా ఎదిగింది. బిబిఎల్ పబ్లిక్ స్కూల్‌లో చదువు పూర్తిచేసిన ఆమె, డిఐటి ఇంజినీరింగ్ కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కాలేజీ రోజుల్లో జరిగిన కొన్ని సంఘటనలు ఆమెను బాగా ప్రభావితం చేయగా, దేశానికి సేవ చేయాలన్న లక్ష్యంతో భారత ఆర్మీలో చేరింది. ఓ మహిళగా ఆర్మీలో చేరడం అంత సులువు కాదు. కానీ ఖుష్బూ తొలి ప్రయత్నంలోనే ఎస్‌ఎస్‌బీ ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించింది. అనంతరం ఆర్మీలో లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టి, క్రమంగా మేజర్ ర్యాంక్ కు ఎదిగింది.
34 ఏళ్లకే ఆమె రిటైర్ అయ్యింది. ప్రస్తుతం ఆమె ఫిట్నెస్ కోచ్, టారో కార్డ్ రీడర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, అలాగే హోలిస్టిక్ వైద్యురాలిగా సేవలు అందిస్తోంది. ఒకరిని చూస్తే స్క్రీన్‌పై మెరిసే స్టార్… మరొకరిని చూస్తే యూనిఫాంలో దేశాన్ని రక్షించే వీరోధి! ఇద్దరూ అక్కచెల్లెళ్లే అనగానే నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సామాన్య కుటుంబం నుంచి వచ్చి, తమదైన ప్రయాణాన్ని ఎంపిక చేసుకొని, ఒక్కరు గ్లామర్ ప్రపంచాన్ని… మరొకరు నిష్టాభక్తులతో దేశ సేవను ఎంచుకోవడం నిజంగా ప్రేరణదాయకం. ఒక ఇంట్లో రెండు ఎక్స్ట్రార్డినరీ టాలెంట్స్… ఖుష్బూ – దిశా పటానీలు నిజంగా ప్రేరణ కలిగించే అక్కచెల్లెళ్లుగా నిలిచారు!