
రీసెంట్‌గా కన్నడ పరిశ్రమ నుంచి విడుదలైన యానిమేషన్ చిత్రం “మహావతార్ నరసింహ” ఆశించిన దానికంటే దూకుడుగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు కొల్లగొడుతోంది. స్టార్ హీరోలు లేకపోయినా, కేవలం కథ, విజువల్స్, భక్తి తాత్వికత ఆధారంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. డివోషనల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కిన ఈ సినిమా విడుదలైన సమయంలో పెద్దగా హైప్ లేకపోయినప్పటికీ, మౌత్ టాక్ ద్వారా అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా వారాంతంలో పాజిటివ్ రివ్యూలు రావడంతో సినిమా బుకింగ్స్ పెరిగి, ప్రతి థియేటర్‌లో హౌస్‌ఫుల్ షోలు కన్పించాయి. ఈ సినిమా విజయంలో ప్రధానంగా హిందీ మరియు తెలుగు వెర్షన్లదే కీలక పాత్ర. రెండు భాషల్లోనూ ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా ఉత్తర భారతంలో హిందీ ఆడియెన్స్ ఈ సినిమాని ఆదరించడంతో బాక్సాఫీస్ వసూళ్లు వేగంగా పెరిగాయి. వారం రోజులు పూర్తవుతాన్నా బుకింగ్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నాయి.
అన్ని ప్రాంతాల్లోనూ థియేటర్లు కిటకిటలాడుతుండటంతో, కొత్త సినిమాల రాబోవడాన్ని కూడా ఈ సినిమా డామినేట్ చేస్తోంది. కేవలం ఇండియాలోనే ఈ సినిమా ఇప్పటి వరకు రు. 53 కోట్ల గ్రాస్ కలెక్షన్లు అందుకున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇది యానిమేషన్ సినిమాల స్టాండర్డ్స్‌తో పోలిస్తే చాలా గొప్ప విజయం. ఈ దూకుడు ఇలాగే కొనసాగితే ఈ సినిమా ఫైనల్ రన్ లో రు. 100 కోట్లు దాటడం ఖాయం అని పరిశ్రమ విశ్లేషకుల అంచనా. గతంలో ఎన్నడూ చూడని రీతిలో యానిమేషన్ సినిమాకు ఇంత ఆదరణ రావడం ఎంతో ప్రోత్సాహకరం. ఇది భవిష్యత్తులో మరిన్ని డివోషనల్ యానిమేషన్ సినిమాల నిర్మాణానికి మార్గం సుగమం చేస్తుందని భావిస్తున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు