ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి ఇప్పటికే 14 నెలలు గడిచింది. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి 14 నెలలు గడిచిన సమయం లో ఈ ప్రభుత్వం పై కొన్ని ప్రశంసలు మరికొన్ని విమర్శలు వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి సమయం లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు ఒక అద్భుతమైన ఆలోచనను ముందుకు తీసుకువచ్చాడు. ఈ ఆలోచన విషయంలో ఎంతో మంది చంద్రబాబు నాయుడు ని ప్రశంసిస్తున్నారు. అది ఏమిటి అనుకుంటున్నారా ..? చంద్రబాబు నాయుడు గారు తాజాగా కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న సందర్భంగా ఇప్పటివరకు కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరూ తమ శాఖలలో ఎలాంటి మంచి పనులు చేశారు.

ఎలాంటి సూచనలు వారి మంత్రిత్వ శాఖకి వచ్చాయి. మీరు ఎలాంటి విధులు నిర్వహించారు. అనే దానిని క్లియర్ గా ఒక నివేదిక తయారు చేసి PPP (పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్) గా ఒక నివేదికను తయారు చేసి దానిని వచ్చే క్యాబినెట్ సమావేశానికి వరకు ఇవ్వాలి అని మంత్రులందరికి చంద్రబాబు నాయుడు సూచించినట్లు తెలుస్తోంది. అలాగే ఏ మంతృత్వ శాఖలో అయినా ఏదైనా పని జరిగినట్లయితే దానిని చేసి అలాగే ఉండడం కాకుండా అది జరిగినట్లు దానిని ఏ రేంజ్ లో చేశాము అనే దానిని గురించి ప్రజలకు క్లియర్ గా తెలిసే విధంగా కూడా ప్రణాళికలను రూపొందించుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారు మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది.

ఇలా గడిచిన 14 నెలల్లో జరిగిన పనుల గురించి , వచ్చిన ప్రతిపాదనల గురించి ఒక క్లియర్ నివేదికను తయారు చేయమని చెప్పడం మాత్రమే కాకుండా ఏవైనా మంచి పనులు చేసినట్లయితే దానిని ప్రజల వరకు తీసుకువెళ్లేందుకు కూడా మంత్రులు కార్యాచరణ చేయాలి అని చంద్రబాబు సూచించడం పట్ల అనేక మంది ప్రజలు చంద్రబాబు ఆలోచన పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: