లోకేష్ కనగరాజ్.. ప్ర‌స్తుతం సౌత్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోని టాప్ స్టార్స్‌కు మోస్ట్ వాంటెడ్ డైరెక్ట‌ర్‌. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్(ఎల్‌సీయూ) నుంచి ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన `ఖైదీ`, `విక్ర‌మ్‌`, `లియో` చిత్రాలు బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్స్ గా నిలిచాయి. ప్ర‌స్తుతం లోకేష్ `కూలీ`తో మ‌రోసారి బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఈ భారీ యాక్ష‌న్ డ్రామాలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా, టాలీవుడ్ కింగ్ నాగార్జున విల‌న్ గా అల‌రించ‌బోతున్నారు. ఆగ‌స్టు 14న కూవీ మూవీ విడుద‌ల కాబోతుంది. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా డైరెక్ట‌ర్ లోకేష్ బ్యాక్ టు బ్యాక్ ఇంట్ర‌ర్వ్యూస్‌లో పాల్గొంటున్నారు.


అయితే తాజా ఇంట‌ర్వ్యూలో లోకేష్ క‌న‌గ‌రాజ్ ఓ ఇంట్రెస్టింగ్ విష‌యాన్ని రివీల్ చేశాడు. కూలీ మూవీ కోసం తానొక స్టార్ హీరో మూవీలో విల‌న్ ఛాన్స్ ను రిజెక్ట్ చేశాన‌ని వెల్ల‌డించాడు. ఇంత‌కీ ఆ హీరో ఎవ‌రో కాదు శివ కార్తికేయ‌న్‌. ప్ర‌స్తుతం సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ `పరాశక్తి` అనే సినిమా చేస్తున్నాడు. పీరియాడికల్ పొలిటికల్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న‌ ఈ చిత్రం శివ కార్తికేయ‌న్ కు 25వ ప్రాజెక్ట్.


శ్రీ‌లీల హీరోయిన్ కాగా.. ర‌వి మోహ‌న్‌, అధ‌ర్వ త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో విల‌న్ గా చేయ‌మ‌ని డైరెక్ట‌ర్ సుధా కొంగర ప‌లుమార్లు లోకేష్‌ను సంప్ర‌దించార‌ట‌. క‌థ‌, క్యారెక్ట‌ర్ న‌చ్చిన‌ప్ప‌టికీ.. కూలీ చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనే ప‌రాశ‌క్తి కూడా సెట్స్ మీద‌కు వెళ్లింది. విల‌న్ గా న‌టించాల‌న్న ఆస‌క్తి ఉన్నా డేట్స్ క్లాష్ అవుతుంద‌న్న కార‌ణంగా ప‌రాశ‌క్తి మూవీని లోకేష్ సున్నితంగా తిర‌స్క‌రించార‌ట‌. శివ కార్తికేయ‌న్ సైతం క‌ల‌గ‌జేసుకుని లోకేష్ ను ఒప్పించేందుకు ప్ర‌య‌త్నించారు. కానీ, కూలీ కోసం నో చెప్ప‌క త‌ప్ప‌లేద‌ని లోకేష్ వెల్ల‌డించారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: