సమాజ్ వాది పార్టీ తరపున రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్న అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్ తరచూ వివాదాల్లో చిక్కుకుంటూ ఉంది. ఆ మధ్యకాలంలో నన్ను జయా బచ్చన్ అని పిలవకండి అని, నాకంటూ ఒక పేరు ఉంది జయ అని మాత్రమే పిలవండి.. భర్త పేరుతో పిలవడం ఎందుకు అంటూ మండి పడింది. కానీ ఆ తర్వాత ఆమెనే నా పేరు జయా బచ్చన్ అంటూ మాట్లాడి ట్రోలింగ్ కి గురైంది. అయితే తాజాగా మరోసారి సోషల్ మీడియా లో విమర్శల పాలవుతుంది. జయా బచ్చన్.ఎందుకంటే తాజాగా ఢిల్లీ కాన్స్టిట్యూషన్ క్లబ్ లో ఓ వ్యక్తి జయా బచ్చన్ తో సెల్ఫీ తీసుకోవడానికి ఆసక్తిగా వచ్చాడు.అయితే ఆయన సెల్ఫీ తీసుకోవడాన్ని నిరాకరిస్తూ జయా బచ్చన్ ఆ వ్యక్తిని తోసేసింది.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో చాలామంది జయా బచ్చన్ ప్రవర్తన పై మండిపడుతున్నారు. 

అయితే ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో తాజాగా ఈ వీడియో పై స్పందించింది బిజెపి ఎంపీ కంగనా రనౌత్.. జయా బచ్చన్ అత్యంత చెడిపోయిన విషేషాధికారం కలిగిన మహిళ.. సమాజ్వాది పార్టీ కోడిపుంజు పందెం కోడిలా  ప్రవర్తిస్తోంది.ఛీ సమాజంలో నీ భర్తకున్న పరువు మొత్తం తీసేస్తున్నావ్.. అమితాబ్ బచ్చన్ భార్యవి కాబట్టి ప్రజలు నిన్ను నీ కోపాన్ని అర్థం చేసుకుంటున్నారు.లేకపోతే నీ పరిస్థితి మరోలా ఉండేది.. నువ్వు చేసిన పని ఎంత అవమానకరం..సిగ్గుచేటు..అమితాబ్ బచ్చన్ పరువు మర్యాదలు గంగలో కలుపుతున్నావు అంటూ సంచలన పోస్ట్ పెట్టింది.

అయితే కంగనా రనౌత్ పెట్టిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారడంతో చాలామంది కంగనాను కూడా ఏకిపారేస్తున్నారు.గతంలో జయా బచ్చన్ పై ఇలాంటి విమర్శలు వచ్చినప్పుడు ఆమెను నువ్వు సమర్థించావు కదా..ఇప్పుడెందుకు విమర్శిస్తున్నావ్.. అప్పుడు నువ్వు రాజకీయాల్లోకి రాలేదు కాబట్టి వెనకేసుకొచ్చావు.ఇప్పుడు రాజకీయాల్లో నీకు ప్రత్యర్థి కాబట్టి విమర్శిస్తున్నావా అంటూ మండి పడుతున్నారు.. ఏది ఏమైనప్పటికీ జయా బచ్చన్ చేసిన పని మాత్రం నెట్టింట తీవ్ర దుమారం సృష్టిస్తోంది.సెల్ఫీ కోసం వచ్చిన వ్యక్తిని నీకు ఇష్టం లేకపోతే ఇప్పుడు వద్దు అని సర్ది చెబితే సరిపోయేది.కానీ నువ్వు మాత్రం అహంకారంతో ఆ వ్యక్తిని తోసేసి నీ కోపం ప్రదర్శించావు అంటూ మండిపడుతున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: