
రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ అరెస్ట్ అవ్వగా ఈ కేసులో గత ఏడాది అనారోగ్య కారణాల చేత బెయిల్ పొందారు. అనంతరం డిసెంబర్ 13న కర్ణాటక హైకోర్టులో రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేసుకున్నారు. అలా ఈ కేసులో నటి పవిత్ర గౌడ తో పాటుగా మరొక 15 మంది నిందితులకు షరతులతో కూడినటువంటి బెయిల్ కూడా ఇచ్చారు.. ఈ విషయాన్ని అప్పట్లో సవాల్ చేస్తూ పోలీసులు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. సుప్రీంకోర్టు విచారణ స్వీకరించి ఇప్పుడు ధర్మాసనం ఇరువురు పక్షాల వాదోపవాదనులను విని తుది తీర్పు తెలియజేసి దర్శన్ బెయిల్ ని కొట్టేసింది.
అభిమాని అయిన రేణుకా స్వామి హత్య కేసులో దర్శన్ ప్రధాన నిందితుడని, మరో నటి పవిత్ర గౌడ పై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు, కామెంట్స్ చేస్తూ ఉండేవారని ఆకక్షతోనే రేణుకా స్వామిని సుఫారీ ఇచ్చి హత్య చేయించారని గత ఏడాది జూన్ 11న ఆరోపణలు రావడంతో అరెస్టు చేశారు. దర్శన్, పవిత్ర గౌడ పేరుతో పాటు మరో 15 మంది పేర్లు పోలీసులు చార్జిషీట్లో తెలిపారు.. ఇలా మొత్తం మీద 3,991 పేజీల చార్జ్ షీట్ నమోదు చేశారు. రేణుకా స్వామి కిడ్నాప్ కేసులో ముగ్గురు ప్రత్యక్ష సాక్షులతో పాటుగా 231 మంది సాక్షులను విచారించినట్లు ఇందులో పొందుపరిచారట.