టాలీవుడ్ దర్శకుడు మారుతి జాక్పాట్ ఛాన్స్ కొట్టేశాడా ..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తోంది. ఇప్పటికే మారుతికి ఛాన్స్ ఇచ్చి ప్రభాస్ మంచి పని చేశాడు అన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా మరొక బిగ్ జాక్పాట్ ఛాన్స్ కూడా కొట్టేశాడని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మనందరికీ తెలిసిందే.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది డైరెక్టర్లు ఉన్నా, కామెడీని పండించే డైరెక్టర్లకు ఎప్పుడూ స్పెషల్ స్థానం ఉంటుంది. ఆ లిస్టులో అనిల్ రావిపూడి, మారుతి టాప్ పొజిషన్‌లో ఉంటారు. పాన్ ఇండియా లెవెల్‌లో గుర్తింపు సంపాదించుకోలేకపోయినా, అటువంటి స్టార్ హీరోలు తమ సినిమాలకు వీరినే చూస్ చేసుకుంటున్నారు.


ప్రస్తుతం మారుతి, ప్రభాస్‌తో "రాజా సాబ్" అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాను హారర్ కామెడీ నేపథ్యంలో తారికెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన అప్డేట్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. వీలైనంత త్వరగా రిమైనింగ్ షూటింగ్ పూర్తి చేసి, డిసెంబర్ 5వ తేదీకి సినిమా రిలీజ్ చేయాలనే ప్లాన్‌తో మేకర్స్ ముందుకు వెళ్తున్నారు. అయితే ఈ సినిమా తర్వాత మారుతి నెక్స్ట్ ఏ హీరోతో వర్క్ చేయబోతున్నాడనే ఆసక్తి ఉంది. లేటెస్ట్‌గా దానికి సంబంధించిన ఒక న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మారుతి తన తదుపరి సినిమాను మెగా హీరోతో ప్లాన్ చేశాడని తెలుస్తోంది.



ఇప్పటికే అల్లు శిరీష్, సాయి ధరమ్ తేజ్‌లతో సినిమాలు చేసిన మారుతి. ఇప్పుడు మరోసారి సాయి ధరమ్ తేజ్‌తో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమాకు మారుతి డైరెక్టర్‌గా కాకుండా ప్రొడ్యూసర్‌గా మాత్రమే వ్యవహరించబోతున్నాడట. "టైగర్ నాగేశ్వరరావు" సినిమాను తెరకెక్కించిన దర్శకుడు వంశీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే పూర్తయిందని, సాయి ధరమ్ తేజ్ కూడా తన కాల్‌షీట్స్ అడ్జస్ట్ చేశాడని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక అప్‌డేట్ రాబోతుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జనాలు కూడా ఆసక్తిగా " ఏం జరుగుతుందో చూద్దాం" అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: