
నిర్మాత నాగవంశీ ఈ మధ్య కాలంలో ఇతర సినిమాలతో పోటీ వల్ల ఊహించని స్థాయిలో నష్టపోయిన సంగతి తెలిసిందే. అందువల్ల ఈ భారీ బడ్జెట్ సినిమాలకు నాగవంశీ పోటీ ఇవ్వకపోవచ్చు. అయితే సంక్రాంతి పండుగ సమయానికి మరికొన్ని సినిమాలు రేసులో నిలిచే ఛాన్స్ అయితే ఉంటుందని కచ్చితంగా చెప్పవచ్చు. సంక్రాంతి కానుకగా విడుదలై పాజిటివ్ టాక్ వస్తే రికార్డులు క్రియేట్ అవుతాయని చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి.
గతేడాది హనుమాన్, ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు చిన్న సినిమాలుగా తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేశాయి. రాబోయే రోజుల్లో మరిన్ని చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయడం పక్కా అనే కామెంట్లు సైతం వ్యక్తమవుతున్నాయి పండుగ కానుకగా సినిమాలను విడుదల చేయడానికి మేకర్స్ సైతం తెగ ఆసక్తి చూపిస్తున్నారనే సంగతి తెలిసిందే.
సంక్రాంతి పండుగ కానుకగా విడుదలయ్యే సినిమాల బడ్జెట్ కూడా ఒకింత భారీ స్థాయిలోనే ఉండనుంది. సంక్రాంతి సినిమాలు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 2026 పండుగ రేసు ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది. ఈ ఏడాది ప్రభాస్ ముఖ్య పాత్రలో నటించిన కన్నప్ప మినహా మరే సినిమా విడుదల కాలేదు. టాలీవుడ్ సినిమాల బడ్జెట్లు సైతం గత కొన్నేళ్లలో ఊహించని స్థాయిలో పెరగడం సోషల్ మీడియాలో సంచలనం అవుతోంది.