మెగాస్టార్ చిరంజీవి మరొకసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఏకంగా కోటి రూపాయలను సైతం విరాళం ఇచ్చినట్లుగా వినిపిస్తున్నాయి. అయితే ఈ డబ్బులను రాష్ట్ర ప్రజలకు అత్యవసర సహాయం, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన నష్టానికి ఉపయోగించాలంటు చిరంజీవి తెలియజేసినట్లు. ఇందుకు సంబంధించి చెక్ ను చిరంజీవి స్వయంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుకి అందించినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగానే సీఎం చంద్రబాబు చిరంజీవి గురించి మాట్లాడుతూ.. చిరంజీవి సామాజిక సేవ చేయడంలో ముందుంటారని ప్రజల సంక్షేమం కోసమే ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారంటూ ప్రశంసించారు.


ఇక చిరంజీవి విరాళం ప్రకటించినట్టుగా అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. దీంతో ఈ విషయాన్ని అభిమానులు కూడా తెగ వైరల్ గా చేస్తున్నారు. చిరంజీవి ఇప్పటికే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అటువైద్యసహాయం, రక్తదాన, నేత్రదానం వంటి సేవా కార్యక్రమాలను కూడా నిరంతరం అందిస్తూనే ఉన్నారు. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు చిరంజీవి. ఇటీవలే తన 70వ పుట్టినరోజు కూడా జరుపుకున్నారు.



సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో "మన శంకర వరప్రసాద్ గారు" అనే సినిమాలో నటిస్తున్నారు. అలాగే డైరెక్టర్ వశిష్ఠ తో విశ్వంభర అనే చిత్రంలో కూడా నటిస్తూ ఉన్నారు. ఈ రెండు సినిమాలు షూటింగ్ కూడా శరవేగంగా చేస్తున్న ఈ రెండు చిత్రాలు కూడా వచ్చే ఏడాది విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఇవే కాకుండా మరి కొంతమంది యంగ్ దర్శకులకు కూడా అవకాశాలు కల్పించే విధంగా చిరంజీవి చేస్తున్నారు. చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత సరైన  సక్సెస్ అందుకోలేకపోవడంతో అభిమానులు కొంత మెరకు నిరాశలో ఉన్నట్టుగా కనిపిస్తోంది. మరి రాబోయే చిత్రాలతో విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: