పోయిన నెల అనగా ఆగస్టు 14 వ తేదీన జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో రూపొందిన వార్ 2 మూవీ మరియు సూపర్ స్టార్ రజనీ కాంత్ హీరో గా రూపొందిన కూలీ మూవీ లు భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ రెండు సినిమాలకి కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర గొప్ప టాక్ ఏమీ రాలేదు. కానీ వార్ 2 మూవీ తో పోలిస్తే కూలీ మూవీ కే కాస్త పరవాలేదు అనే టాక్ వచ్చింది. దానితో ఓవరాల్ గా చూసుకున్నా కూడా వార్ 2 మూవీ తో పోలిస్తే ప్రపంచ వ్యాప్తంగా కూలీ సినిమాకు కాస్త ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి.

ఇకపోతే కలెక్షన్ల విషయం కాస్త పక్కన పెడితే ఓ విషయంలో మాత్రం కూలీ మూవీ ని వార్ 2 అధిగమించింది అని కొంత మంది అనుకుంటున్నారు. అది ఏ విషయంలో అనుకుంటున్నారా ..? ఓ టీ టీ ఎంట్రీ విషయంలో ... సాధారణంగా స్టార్ హీరోలు నటించిన సినిమాలు ఓ టీ టీ లోకి కాస్త ఆలస్యంగా వస్తూ ఉంటాయి. అందుకు ప్రధాన కారణం సినిమాలు విడుదల అయ్యాక ఏ రేంజ్ టాక్ ను తెచ్చుకుంటాయో ..? ఎన్ని రోజులు బాక్సా ఫీస్ దగ్గర కలెక్షన్లను వసూలు చేస్తాయో అనేది అంచనా వేయలేము. దానితో కనీసం 50 రోజులు తర్వాత ఓ టీ టీ లోకి ఎంట్రీ ఈ విధంగా ఒప్పందాలను నిర్మాతలు ఓ టీ టీ సంస్థలతో కుదుర్చుకుంటూ ఉంటారు.

దానితో 50 రోజులు ముగిసాక స్టార్ హీరోలు నటించిన  సినిమాలు సాధారణంగా ఓ టీ టీ ప్లాట్ ఫామ్ లోకి ఎక్కువ శాతం ఎంట్రీ ఇస్తూ ఉంటాయి. ఇక కూలీ సినిమా మాత్రం ఈ నెల 11 వ తేదీనే ఓ టీ టీ లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఒక స్టార్ హీరో నటించిన సినిమ నెల తిరగకుండానే ఓ టీ టీ లోకి వచ్చేస్తుంది. ఇక వార్ 2 ఓ టీ టీ విడుదలకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: