కన్నడ నటుడు దర్శన్ ప్రస్తుతం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలులో ఉన్నారు. చిత్రదుర్గలో రేణుకాస్వామి హత్య కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు ముందు హాజరైన దర్శన్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.

జైలులో తాను ఎదుర్కొంటున్న కష్టాలను వివరిస్తూ, "చాలా రోజులుగా నేను సూర్యరశ్మిని చూడలేదు. గదిలో దుస్తుల నుంచి దుర్వాసన వస్తోంది. ఫంగస్ పెరిగిపోవడం నాకు భయాన్ని కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేను బ్రతకలేను" అని దర్శన్ ఆవేదన వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, "నాకు విషమివ్వండి, ఈ జీవితం అత్యంత దుర్భరంగా ఉంది" అని ఆయన కోర్టును కోరినట్లు సమాచారం. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. రేణుకాస్వామి హత్య కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. ఈ కేసులో దర్శన్‌తో పాటు ఆయన సన్నిహితులు కూడా నిందితులుగా ఉన్నారు.

ఈ కేసులో ఇంకా ఎటువంటి కీలక తీర్పు రాలేదు, విచారణ కొనసాగుతోంది. దర్శన్ చేసిన ఈ వ్యాఖ్యలపై పోలీసులు, కోర్టు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. ఈ ఘటన కన్నడ చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది. దర్శన్ చేసిన కామెంట్ల గురించి జైలు అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.  ఈ కేసుల వల్ల దర్శన్ కెరీర్  ప్రమాదంలో పడినట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తప్పు చేస్తే సెలబ్రిటీలకు అయినా శిక్ష తప్పదని దర్శన్ కేసుతో ప్రూవ్ అయిందని చెప్పవచ్చు.  దర్శన్ చేసిన తప్పులు అతని కెరీర్ కు శాపంగా మారాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: