
ఇదే విషయంపై రితిక నాయక్ మాట్లాడుతూ.."తేజ సజ్జాకి షూటింగ్లో ఎన్నోసార్లు గాయాలయ్యాయి. అయినా సరే వాటన్నిటిని లెక్కచేయకుండా ఎలాంటి రెస్టు తీసుకోకుండా షూటింగ్లో పాల్గొనేవారు.. చాలాసార్లు క్లైమేట్ ని తట్టుకోలేక అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా పట్టు వీడకుండా తాను అనుకున్న సమయంలోనే సినిమా షూటింగ్ లొకేషన్లోనే పూర్తి చేసేవారు" అంటూ తెలియజేసింది రితిక నాయక్. ఇంకా ఆమె మాట్లాడుతూ.."తేజ సజ్జా చాలా మొండివాడు. అలాంటి హీరో తో పని చేయడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నానంటూ" తెలిపింది. అంతేకాదు హీరో తేజ సజ్జ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. అతడి డెడికేషన్ చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అందుకే హీరోగా అతి చిన్న వయసులోనే ఈ స్థాయిలో ఉన్నారేమో అనిపిస్తుంది అంటూ తెలిపింది రితిక. ఇప్పటికీ సినిమాల కోసం తేజ సజ్జా కష్టపడుతూనే ఉన్నారంటూ తెలిపింది.
తాము మిరాయ్ సినిమా కోసం ఎన్నో ఏరియాలలో తిరిగాము.. సుమారుగా 80 శాతం షూటింగ్ డిఫరెంట్ ప్రాంతాలలోనే పూర్తి చేసామని తెలిపింది. నాచురల్ గా ఉండాలని ఉద్దేశంతోనే అలా చాలా చోట్ల ఈ సినిమా షూటింగ్ ని చేశాము.. తాము సినిమా కోసం ఎంత కష్టపడ్డామో థియేటర్లలో మీకే కనిపిస్తుంది. మిగతా సినిమాలకు ఈ సినిమాకి మధ్య చాలా తేడా కనిపిస్తుందని తెలిపింది రితిక నాయక్