మీరాయ్ చిత్రంలో  హీరోగా తేజ సజ్జా, హీరోయిన్గా రితిక నాయక్ నటించారు విలన్ గా మంచు మనోజ్ నటించారు. ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ రోజున భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవెల్ లో విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.మీరాయ్ చిత్రంలో హీరోయిన్గా నటించిన రితిక గురించి తాజాగా ఇప్పుడు ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది. ఈ చిత్రంలో నటించిన రితిక.. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని కి అక్క అవుతానని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది వాటి గురించి చూద్దాం.



ఇటీవలే మీరాయ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రితికసినిమా గురించి తన అనుభవాలను తెలియజేసింది. రితిక మాట్లాడుతూ ఆకాశవనంలో అర్జును కళ్యాణం సినిమా తర్వాత తాను ఒక సరైన సినిమా కథ కోసం ఎదురు చూస్తున్నానని ఆ సమయంలోనే డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తనకు మీరాయ్ కథ చెప్పారని కథ విన్నప్పుడు ప్రేక్షకురాలిగా విన్నాను ఈ చిత్రంలో ఎక్కువగా ఫాంటసీ ,అడ్వెంచర్ , లవ్ అన్ని బాగా నచ్చేయడమే కాకుండా ఇందులో తాను హిమాలయాలలో ఉండేటువంటి ఒక సన్యాసి క్యారెక్టర్ అని.. తన పాత్ర పేరు విభ అంటూ చెప్పడంతో ఒప్పుకున్నానని తెలిపింది రితిక.తేజ  గురించి కూడా మాట్లాడుతూ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు ఎన్నో రిస్కులు చేశారు మంచి అబ్బాయి అంటూ తెలిపింది.




సినిమా షూటింగ్ సెట్లో డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తమ్ముడు అని పిలిచేదాని.. తను కూడా నన్ను అక్క అని పిలిచేవారు. ఎందుకంటే నా పుట్టిన రోజు అక్టోబర్ 27 అయితే డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని గారి పుట్టినరోజు అక్టోబర్ 28 అని ఈ ఒక్క కారణం వల్లే సంబంధం లేకుండానే నేను అక్క ,అతను నాకు తమ్ముడు అయ్యారంటు తెలియజేసింది. అలా సినిమా షూటింగ్ సెట్ల ఇద్దరం అక్క, తమ్ముడు అయ్యామంటూ తెలిపింది.మొత్తానికి మీరాయ్ సినిమాతో మరొకసారి సక్సెస్ ని అందుకుంది రితిక. 2023 లో వచ్చిన  హాయ్ నాన్న సినిమాలో కూడా ఒక కీలకమైన పాత్రలో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: