
మైదాన ప్రాంతంలో గిరిజన గ్రామాలు , ఏపీ రాష్ట్రంలో గ్రంథాలయాల పైన చర్చ జరుగుతూ ఉండగా అలాగే జీఎస్టీ సంస్కరణల పైన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా మాట్లాడబోతున్నారు. అనంతరం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటు విధానం పైన కూడా సభలలో చర్చించేలా భావిస్తున్నారు.ఈరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు శాసన మండల సమావేశాలు జరగబోతున్నాయి.
అసెంబ్లీలో ఈరోజు ప్రశ్నోత్తరాలు:
1).20 లక్షల ఉద్యోగ కల్పన పై
2).వైయస్సార్ కడప జిల్లాలో ముగ్గురాయి అక్రమ తవ్వకం
3). ప్రైవేటు వైద్య పరీక్షల కేంద్రాలు
4). దీపం -2 పథకం
5). నకిలీ ఎరువుల విక్రయం
6). నాగవల్లి నది మీద పూర్ణపాడు - లాభేసు వంతెన
7). నిరుద్యోగ యువతకి ఆర్థిక సహాయం
8). సిమెంటు ధరలలో వ్యత్యాసం
ఇవే కాకుండా మరికొన్నిపైన ప్రశ్నించే అవకాశం ఉన్నది.
సభలో ప్రవేశపెట్టబోయే బిల్లులు:
1). ఏపీ అత్యవసర నిర్వాహన చట్టం నోటిఫికేషన్
2). ఏపీ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ వార్షిక నివేదిక
3). ఏపీ పర్యావరణ నిర్వహణ సంస్థ వార్షిక నివేదిక
4). ఆబ్కారీ నియమాలు
5). ఏపీ అల్పసంఖ్యాక వర్గాల ఆర్థిక సంస్థ వార్షిక నివేదిక
6). ఆంధ్రాలో హస్తకళ అభివృద్ధి
7). కార్మిక కర్మాగారాలు, బాయిలర్లు, బీమా వైద్య సేవలో నోటిఫికేషన్
అనంతరం జిఎస్టి తగ్గింపు పైన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వివరణ.