ఒకప్పుడు “అమెరికా వెళ్తే జీవితం సెట్” అన్న నమ్మకం మధ్యతరగతి కుటుంబాల్లో బలంగా ఉండేది. పిల్లలను అమెరికాకు పంపించాలన్న తపనతో కోట్లు అప్పులు చేసిన కుటుంబాలు కూడా ఉన్నాయి. “ఒకసారి అమెరికాలో అడుగుపెడితే డాలర్ల వర్షమే” అన్న భ్రమలో అందరూ మునిగిపోయారు. కానీ రోజులు మారిపోయాయి. పరిస్థితులు మారాయి. ఇప్పుడు అదే అమెరికా క్రమంగా నరకం లాంటి గమ్యం అవుతోందన్న భావన జెన్‌ Zలో బలపడుతోంది. గతంలో అమెరికా ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదగడంతో, టెక్నాలజీ రంగం బూమ్ అవడంతో ఉద్యోగావకాశాలు పుష్కలంగా లభించాయి. మ్యాన్‌పవర్ కోసం భారత్‌ సహా అనేక దేశాల యువతకు వీసాలు ఇచ్చారు. కానీ ఇప్పుడు గ్లోబల్ కంపెనీలు అమెరికాకు మాత్రమే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా తమ కార్యాలయాలను విస్తరించాయి.
 

AI, రోబోటిక్స్, ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలు తగ్గిపోతున్నాయి. అమెరికాలో ఒకప్పుడు లభించిన పెద్ద అవకాశాలు ఇప్పుడు తగ్గిపోవడం ప్రారంభమైంది. అమెరికా ఒకప్పుడు ప్రపంచంలో అత్యంత సురక్షిత దేశమని చెప్పుకునేది. “911”కి కాల్ చేస్తే గుండుసూది దాకా తెచ్చిపెడతారని గొప్పలు చెప్పుకునే స్థాయిలో ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. గన్ వైలెన్స్ విపరీతంగా పెరిగిపోయింది. కాల్పుల ఘటనలు రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. రాజకీయంగా కూడా జాతి విద్వేషాలు మళ్లీ మంటలు రేపుతున్నాయి. ట్రంప్ వంటి నాయకుల వ్యాఖ్యలు అమెరికాలో వర్గ వివక్షను మరింత పెంచుతున్నాయి. దీంతో సేఫ్ కంట్రీ అన్న ఇమేజ్ అమెరికా కోల్పోతోంది. అమెరికాకు వెళ్లిన భారతీయులు ఇప్పుడు తమ బంధువులకు “ఇక్కడ క్షణక్షణం భయమే” అని చెబుతున్నారు.

 

హెచ్-1బీ వీసా సమస్యలు వచ్చినప్పుడు, ఇండియన్ల విమాన టిక్కెట్లు బ్లాక్ చేయడం జరిగింది. అంటే ఇండియన్లపై వివక్ష ఏ స్థాయికి చేరుకుందో అర్థం చేసుకోవచ్చు. ఇక అక్కడికి వెళ్లినవారు సేఫ్టీ కోసం ఎప్పుడూ ఆందోళనలో ఉండాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు, ఇండియాలోనే ఇప్పుడు అమెరికన్ లైఫ్‌స్టైల్ దొరుకుతోంది. పెద్ద సాలరీలు, మల్టీనేషనల్ కంపెనీలు, లగ్జరీ లైఫ్ ఇవన్నీ ఇక్కడే లభిస్తున్నాయి. అవకాశాలు కూడా రోజురోజుకూ పెరుగుతున్నాయి. అందుకే జెన్‌ Z అమెరికా వెళ్తే తప్పకూడదనుకునే పరిస్థితి నుండి, “ఇక్కడే సెట్ అవుదాం” అనే దిశగా ఆలోచిస్తోంది. మొత్తంగా, అమెరికా కల ఇప్పుడు భయం – అనిశ్చితి – అవకాశాల కొరతగా మారిపోయింది. జెన్‌ Z దృష్టిలో అమెరికా ఇక టార్గెట్ కాదు. ఇది మన దేశానికి కూడా ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవాలి

మరింత సమాచారం తెలుసుకోండి: