
ఈ అభిమానుల జాబితాలో మనకు షాక్ ఇచ్చే విషయం ఏంటంటే టాప్ డైరెక్టర్ సుజిత్ కూడా పవన్ కళ్యాణ్‌కి హార్డ్‌కోర్ ఫ్యాన్ కావడం. తాజాగా, హైదరాబాదులోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా జరిగిన ఓజీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ విషయాన్ని స్టేజ్‌పైనే చెప్పుకొచ్చారు. సాయంత్రం వర్షం కారణంగా కొంత ఇబ్బంది కలిగినా, అభిమానుల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. వేలాది మంది ఫ్యాన్స్ కోలాహల నడుమ ఈవెంట్ అద్భుతంగా సాగింది. సినీ రంగానికి చెందిన ప్రముఖులు, చిత్రబృందం ఈ వేడుకలో పాల్గొని మరింత వైభవాన్ని తీసుకొచ్చారు.
స్టేజ్‌పైకి వచ్చిన పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజిత్ గురించి మాట్లాడుతూ.. “సుజిత్ నాకు చాలా బిగ్ ఫ్యాన్. ఆయన పవన్ కళ్యాణ్‌కి వీరాభిమాని అన్న విషయం మీ అందరికీ తెలిసిందే. జానీ సినిమా తరువాత, నేను వేసుకున్న హెడ్‌బ్యాండ్ చూసి బాగా ఇంప్రెస్ అయి, చాలా రోజుల పాటు తాను కూడా హెడ్‌బ్యాండ్ కట్టుకొని తిరిగాడట"..అని చెప్పుకొచ్చారు. ఇది సాధారణంగా కామన్ పీపుల్ చేసే పని. కానీ ఒక డైరెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా ఇంతగా నన్ను అభిమానించడం నిజంగా ఫ్యాన్స్ కి ఆశ్చర్యం కలిగించింది.
ఇంకా పవన్ మాట్లాడుతూ.."సినిమా మీద ఉన్న పిచ్చి, ప్యాషన్ వల్లే ఈ స్థాయికి వచ్చాడు సుజిత్. సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ గారు కూడా నాకు ‘సుజిత్‌తో సినిమా చేస్తే బాగుంటుంది’ అని సూచించారు. అప్పుడే దానయ్య గారి ద్వారా పరిచయం జరిగింది. సుజిత్ కథ చెప్పే తీరు చాలా సింపుల్‌గా ఉంటుందేమో కానీ, తీసేటప్పుడు మాత్రం డెప్త్‌తో చూపిస్తాడు. అదే అతని స్పెషాలిటీ. ఈ ఓజీ సినిమా చూసిన తర్వాత మీ అందరికీ సుజిత్ అసలు ఎలాంటి దర్శకుడు అనేది స్పష్టంగా తెలుస్తుంది” అంటూ అన్నారు. ఈ మాటలు విన్న ఫ్యాన్స్ ఒక్కసారిగా సంబరాల్లో మునిగిపోయారు. సోషల్ మీడియాలో కూడా ఈ విషయమే ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.
“జానీ సినిమా చూసి హెడ్‌బ్యాండ్ వేసుకొని తిరిగాడా? సాధారణ ఫ్యాన్స్ చేసే పనిని ఒక స్టార్ డైరెక్టర్ చేయడం నిజంగా అద్భుతం. పవన్ కళ్యాణ్ అంటే సుజిత్‌కి ఇంత పిచ్చి ఉందా!” అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు “ఇదే పవన్ కళ్యాణ్ మానియా. పవన్‌ని ఇష్టపడిన వారు ఎప్పటికీ ఆయనను మరిచిపోలేరు” అంటూ కామెంట్లు చేస్తున్నారు.మొత్తం మీద ఓజీ సినిమా రిలీజ్‌కి ముందే, పవన్ కళ్యాణ్ మానియా ఎంతలా ఉందో ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది. అభిమానుల మద్దతు, దర్శకుడి ప్యాషన్, పవన్ కళ్యాణ్‌కి ఉన్న క్రేజ్—అన్ని ఈ సినిమాకి హిస్టారికల్ హైప్ తెచ్చాయి.