
మనం అందరం తెలుసుకున్నదే, పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా “ఓజి”, డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో, తెరకెక్కిన చిత్రం. ఇందులో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించారు. తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఎల్బీ స్టేడియంలో జరిగింది. నిన్న సాయంత్రం జరిగిన ఈ ఈవెంట్ ఘనవంతంగా, విజయవంతంగా ముగిసింది. వర్షం పడడం వల్ల కొంతమంది ప్రేక్షకులు ఇబ్బందిపడ్డప్పటికీ, మిగతా అన్ని అంశాలల్లో జాగ్రత్తలు తీసుకున్నారు చిత్ర బృందం. వర్షం వచ్చినప్పటికీ, పవన్ కళ్యాణ్ ఎక్కడ తగ్గకుండా ఈవెంట్‌ను ఘనంగా పూర్తి చేశారు.
ఈ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్, హీరోయిన్ ప్రియాంక మోహన్ గురించి మాట్లాడుతూ .."ఈ సినిమాలో 80 నాటి అమ్మాయిల ప్రియాంక కనిపిస్తారు. ప్రతి ఒక్కరి పెర్ఫార్మెన్స్ చాలా చక్కగా ఉంటుంది, మీరు తప్పకుండా ఇంప్రెస్ అవుతారు. నిజానికి మా మధ్య ఉన్న అనుబంధం చాలా తక్కువసేపే కానీ, చాలా హృదయాన్ని ఆకట్టుకుంటుంది. ఇలాంటి జీవితం అందరికి ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు ఆశపడుతారు ఈ చిన్న ప్రేమ కథ సినిమాకు రవిచంద్రన్ గారి అందమైన విజువల్స్ మరో లెవల్‌లో ఉంటాయి." అంటూ చెప్పుకొచ్చారు.
అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ సినిమాలో “సువ్వి సువ్వి” సాంగ్ రిలీజ్ తర్వాత, చాలామంది అభిమానులు ప్రియాంక మోహన్ క్యారెక్టర్ చనిపోతుందంటూ గెస్ చేశారు. ఇప్పుడు, పవన్ కళ్యాణ్ కూడా “మా మధ్య అనుబంధం కొంచెం సేపే ఉంటుంది” అంటూ చెప్పడంతో, అభిమానులు ఈ సినిమాలో ప్రియాంక మోహన్ క్యారెక్టర్ చనిపోతుందని ఫిక్స్ అయ్యారు.ఇక సోషల్ మీడియాలో ఈ వార్త సుదూరంగా వైరల్‌గా మారింది, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు, ప్రియాంక మోహన్ ఫ్యాన్స్ అందరూ ఈ ఫ్రీ ఈవెంట్‌ను మరియు కొత్త సినిమా గురించి ఉత్సాహంతో మాట్లాడుతున్నారు.