
బ్యూటీ చిత్రంలో హీరోయిన్ కి తండ్రి పాత్రలో నటించారు నరేష్. ఈ సినిమా ప్రమోషన్స్ లో మాట్లాడుతూ.. తన అమ్మ తనని "నరి "అని చాలా ముద్దుగా పిలుస్తుందని మరి ఎక్కువగా ప్రేమ అయితే నారీ అని పిలిచేదని ఆ సమయంలోనే తన తల్లిని తాను కాక పట్టవచ్చు అని అర్థం చేసుకునే వాడినట్టు తెలిపారు.. నరి అంటే తమిళంలో నక్క అని దీంతో తన ఫ్రెండ్స్ అందరూ కూడా తనని ఫాక్స్ అని ఎక్కువగా పిలిచేవారని తెలిపారు నరేష్.
అయితే ఇక తనను అలా పిలిచేవారు ఇప్పుడు ఎవరూ లేరని.. పవిత్ర లోకేష్ మాత్రం తనని చాలా గౌరవంగానే పిలుస్తుందని ముద్దుగా అయితే "రాయ " అని పిలుస్తుందని తెలిపారు నరేష్. గత కొంతకాలంగా పవిత్ర లోకేస్, నరేష్ కలిసే ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే..వీరు త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారనే విధంగా వార్తలు వినిపించాయి. కానీ వివాహ ప్రకటన చేయకముందే ఇద్దరు కలిసే ఉంటున్నట్లు వినిపిస్తున్నాయి. పవిత్ర లోకేష్ కూడా ఈ మధ్యకాలంలో సినిమాలను పెద్దగా కనిపించలేదు. వీరిద్దరూ కలిసి చివరిగా మళ్ళీ పెళ్లి అనే చిత్రంలో నటించారు. ప్రస్తుతం నరేష్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారుతున్నాయి.