
పవన్ కళ్యాణ్ గంభీరంగా గర్జిస్తున్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక, ఆర్మూళ్ మోహన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. వారి అద్భుత నటన సినిమా స్థాయిని మరింత పెంచుతోంది. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించరు. ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు బాగా హైలైట్ అయ్యాయి. ఆయన ఇచ్చిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పవన్ కళ్యాణ్ స్పీచ్‌లో సినిమాకి సంబంధించిన విషయాలు, కష్టాలు, ప్రియాంక మోహన్ క్యారెక్టర్, సుజిత్ చేసిన ప్రత్యేక ప్రయత్నాలు, అలాగే సుజాత్ తనకు ఎంత పెద్ద ఫ్యాన్ అని తెలియజేశారు. అంతేకాక, సుజిత్ తో పనిచేయడం ఆయనకు చాలా ప్రత్యేక అనుభవమని, డైరెక్షన్ సమయంలో సుజిత్ లాంటి వ్యక్తి అలా టీం ఉంటే, రాజకీయాల్లోకి రావాలి అనే ఆలోచనే కూడా వచ్చుండేది కాదేమో అని అన్నారు.
ఈ సినిమా ప్రతి అంశం ప్రేక్షకులను మంత్రముగ్ధులా చేస్తుంది అని పవన్ కళ్యాణ్ తెలిపారు. రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస గార్ల అద్భుతమైన విజువల్స్ ఈ చిత్రానికి భారీ ప్లస్ గా మారబోతున్నాయి అని..చెప్పుకురావడం సినిమా కి మరింత హైప్ ఇచ్చింది. ఇక సినిమా మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వేరే లేవ్ల్ లో ఉంటుంది అని ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు చెప్పేస్తున్నాయి..!