
ఒక హైదరాబాదులోని ఏకంగా 550 షోలు పడబోతున్నాయి. ఇవన్నీ కూడా ఆల్రెడీ హౌస్ ఫుల్ బోర్డుతోనే నడుస్తున్నాయి. మరికొన్ని చిత్రాలు గతవారం క్రితం విడుదలైన సినిమాలు థియేటర్లో ఆడుతున్నాయి. ఇలాంటి సమయంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ మీద ఉండే అభిమానం, ప్రేమతో మిరాయ్ సినిమా హీరో తేజ సజ్జా , అటు నిర్మాతలు ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఓజి సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.. ఆరోజున మిరాయ్ మూవీ ఆడే థియేటర్లన్నీ కూడా ఓజి సినిమాకి ఇవ్వాలని డిసైడ్ అయ్యారు నిర్మాతలు.
దీంతో గురువారం రోజున మిరాయ్ సినిమాకి బదులుగా ఓజి సినిమాని రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండబోతున్నాయి. ఆ తర్వాత శుక్రవారం రోజు నుంచి మిరాయ్ సినిమా యధావిధిగా థియేటర్లలో కొనసాగుతుందంటూ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా నిర్మాత విశ్వ ప్రసాద్, పవన్ కళ్యాణ్ కి కూడా మంచి స్నేహితుడు కావడం చేత అలాగే తేజ సజ్జా చిన్నప్పటి నుంచి మెగా హీరో అభిమాని కావడం చేత చిత్ర బృందం తీసుకున్న ఈ నిర్ణయానికి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా ప్రశంసస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..