సినిమా ఇండస్ట్రీ లో ఏదైనా మూవీ ఫ్లాప్ అయినా సినిమా , ద్వారా పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చిన అత్యంత కష్టాలను ఎదుర్కొనేది నిర్మాత. ఒక వేళ ఆ సినిమా ద్వారా పెద్ద మొత్తంలో నష్టాలు వస్తే ఆ నష్టాలను పూడ్చడానికి అప్పుల్లోకి వెళ్ళేది కూడా నిర్మాతే. హీరో , హీరోయిన్ , డైరెక్టర్ , నటీ నటులు , ఇతర సాంకేతిక నిపుణులు అంతా కూడా సినిమా ఫ్లాప్ అయినా , సినిమా ద్వారా తీవ్ర మొత్తంలో నష్టాలు వచ్చిన వారికి ఆర్థికంగా ఎలాంటి టెన్షన్ ఉండదు.

కానీ ఓ సినిమా ఫ్లాప్ కావడం వల్ల ఒక హీరో అప్పుల్లో కురుకుపోయినట్లు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు టాలీవుడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ. ఈయన కొంత కాలం క్రితం జాక్ అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. వైష్ణవి చైతన్యమూవీ లో హీరోయిన్గా నటించగా ... బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే ఈ సినిమా ద్వారా పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చినట్లు , ఈ మూవీ ద్వారా కేవలం హీరో రెమ్యూనరేషన్ కూడా వెనక్కు రాలేదు అని ఈ సినిమా నిర్మాత కామెంట్స్ చేసిన విషం మనకు తెలిసిందే. ఇకపోతే తాజాగా సిద్దు జొన్నలగడ్డ ఓ ఇంటర్వ్యూలో భాగంగా తన రెమ్యూనరేషన్ గురించి మాట్లాడాడు.

తాజాగా సిద్దు మాట్లాడుతూ ... నేను ఆఖరుగా జాక్ అనే సినిమాలో హీరో గా నటించాను. ఆ మూవీ చాలా పెద్ద ఫ్లాప్ అయ్యింది. నా సినిమా వల్ల నా నిర్మాత నష్టపోకూడదు అనే ఉద్దేశంతో నేను తీసుకున్న రెమ్యూనరేషన్ మొత్తాన్ని నిర్మాతకు వెనక్కు ఇచ్చేశాను. ఆ డబ్బులను వెనక్కు ఇవ్వడం కోసం నేను బ్యాంకులో లోన్ తీసుకొని మరి 4.6 కోట్ల డబ్బును వెనక్కు ఇచ్చాను. దానితో నేను అప్పుల్లోకి వెళ్లిపోయాను. ప్రస్తుతం నేను ఆ అప్పు తీర్చడానికి ప్రయత్నిస్తున్నాను అని ఆయన చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: