
ఈ సినిమా నష్టపోయిందని తెలిసి రూ. 4.75 కోట్ల రూపాయలు అప్పు చేసి మరి ఇచ్చాను. ఎందుకంటే ఆ సమయంలో తన చేతిలో ఒక్క రూపాయి కూడా లేదని అందుకే అప్పు చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఆ అప్పుడు ఎలా తీర్చాలనే విషయం పైన ఆలోచిస్తున్నాను! ఆ డబ్బులు ఇచ్చినందుకు తాను బాధపడలేదు ఎందుకంటే ఆ సినిమాతో చాలామంది నష్టపోయారు. అది నాకు నచ్చలేదు.. అందుకే డబ్బులు తిరిగి ఇచ్చేశానంటూ వెల్లడించారు సిద్దు.
జాక్ సినిమాకి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించారు .సిద్దుకి జోడుగా వైష్ణవి చైతన్య నటించింది. యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ గా వచ్చిన జాక్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా నష్టాల పైన రూమర్స్ వినిపించినప్పటికీ.. హీరో సిద్దు చేసిన సహాయం మాత్రం ఇప్పటివరకు బయటకు రాలేదు. స్వయంగా సిద్దునే క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో అభిమానులే వైరల్ చేస్తున్నారు. ఎందుకంటే సినిమాలు విడుదలైన తర్వాత నష్టాలు వచ్చాయి అంటే చాలా తక్కువ మంది మాత్రమే ఇలా డబ్బులను వెనక్కి తిరిగి ఇవ్వడం జరుగుతుంది. స్టార్ హీరోలు కూడా చేయలేని పని సిద్దు చేయడంతో అభిమానులు కూడా నిర్మాతల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఆలోచించిన హీరో మా హీరో అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.