ప్రస్తుతం దేశం లో ఆసక్తికరంగా బీహార్ రాష్ట్రం మారింది. త్వరలో ఇక్కడ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో ఏ పార్టీ గెలుస్తుంది అనేది చాలా ఉత్కంఠ గా ఉంది. ఎలాగైనా ఇక్కడ విజయం సాధించాలని బిజెపి అనేక విధాలుగా పావులు కదుపుతోంది.. ఇదే తరుణం లో కాంగ్రెస్ అధినాయకుడు రాహుల్ గాంధీ మరియు  తేజస్వి యాదవ్ విడివిడిగా తిరుగుతూ  ప్రజల్లో జోష్ పెంచుతున్నారు.  ఇదే తరుణం లో కమలం పార్టీ చాలా అప్రమత్తమైంది. మరి ఇక్కడ గెలుపు తీరాలకు పోయేది ఎవరు అనే వివరాలు చూద్దాం.. నవంబర్ రెండో వారం లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారంలో విపక్ష కూటమిదే పై చేయిగా కనిపిస్తోంది. 

అలాగే ఎన్డీఏ కూటమి ఇండియా కూటమి వద్ద నువ్వా నేనా అన్నా పోటీ ఏర్పడింది. రాహుల్ గాంధీకి తోడుగా ఆర్జెడి నేత తేజస్వి యాదవ్ కూడా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బీహార్ లో నిరుద్యోగం వంటి అంశాలను లేవనెత్తుతూ నితీష్ కుమార్ సర్కారు ను నిందిస్తున్నారు. కాంగ్రెస్ ఎన్ని ఎత్తులు వేసినా బిజెపి వారి ఎత్తులను కనిపెట్టి పై ఎత్తులు వేస్తూ ముందుకు వెళ్తోంది. ఇదే తరుణంలో సి ఓటర్ యశ్వంత్ కుమార్ చెప్పిన వివరాల ప్రకారం బీహార్లో 175 సీట్లు ఎన్డీఏ ప్రభుత్వం గెలవబోతుందని చెప్పారు.  

ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎక్కువగా మోడీ కి ఉపయోగపడుతుందని తెలియజేశారు. మొత్తం 75 లక్షల మంది మహిళలకు 10వేల రూపాయల చొప్పున ఇప్పటికే బ్యాంక్ అకౌంట్ల లో వేసేశారు. దీని ఇంపాక్ట్ తో 243 సీట్లలో 175 బిజెపి కి వస్తున్నాయని అన్నారు. ఇదే జరిగితే మాత్రం భారతీయ జనతా పార్టీకి ఇక్కడ తిరుగు లేదని చెప్పవచ్చు. మరి చూడాలి మహిళల ఓట్లు బిజెపికి కలిసి వస్తాయా లేదా అనేది ముందు ముందు తెలియబోతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: