టాలీవుడ్ హీరో నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో రాబోతున్న రెండవ చిత్రం ది ప్యారడైజ్. ఈ చిత్రంలో హీరో నాని చాలా కొత్త పాత్రలో కనిపించబోతున్నారు. గత కొంతకాలంగా ఈ సినిమాలో టాలీవుడ్ హీరో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా నటించబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. అందుకు తాజాగా చిత్ర బృందం కూడా అధికారికంగా మోహన్ బాబు పోస్టర్ కి సంబంధించి అఫీషియల్ గా విడుదల చేసింది. అయితే ఈ పోస్టర్లో మోహన్ బాబు షర్ట్ లెస్ తో కనిపించారు. ఈ పోస్టర్ చూసి ఫ్యాన్స్ ఆకట్టుకునేలా కనిపిస్తోంది.


వాస్తవంగా మోహన్ బాబు మొదట ఇండస్ట్రీలోకి వచ్చింది విలన్ గానే. ఆ తర్వాత తన టాలెంట్ తో హీరోగా మారి ఎన్నో చిత్రాలలో నటించారు మోహన్ బాబు. అంతేకాకుండా కొంతమంది హీరోల కోసం ప్రత్యేకించి మరి పలు చిత్రాలలో కీలకమైన పాత్రలో నటించారు. ఈమధ్య మోహన్ బాబు కూడా చాలా సెలెక్టివ్ గానే పాత్రలు ఎంచుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. తనకు రోల్ నచ్చితే ఎలా కనిపించడానికైనా సిద్ధంగానే ఉన్నారు. మరి ది ప్యారడైజ్ సినిమాలో మోహన్ బాబు నటన ఏవిధంగా ఉంటుందో అంటూ అభిమానులు కూడా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.


మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్ విషయానికి వస్తే.. స్టైలిష్ గా బ్లాక్ గాగుల్స్ ధరించి, రక్తపు మడుగుల చేతులతో ఒక చేయి తుపాకీ మీద మరొక చేతిలో సిగరెట్టు పట్టుకొని  స్టైలిష్ గా తాగుతున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ మోహన్ బాబు చేస్తున్న ఈ పాత్ర సక్సెస్ అయితే కెరీర్లో బిజీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇక హీరో నాని కూడా ది ప్యారడైజ్ చిత్రంలో జడల్ రోల్ ని రివిల్ చేశారు. ముఖ్యంగా గ్లింప్స్ కు భారీ రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పైన అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: