పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ది రాజా సాబ్, ఫౌజీ షూటింగ్స్ పూర్తి చేస్తూ, త్వరలోనే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ సెట్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ మూవీపై ప్రారంభం నుంచే అభిమానుల్లో భారీ హైప్ ఉంది. ఎందుకంటే ఇందులో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడని టాక్. అంతేకాదు ప్రభాస్ తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్రలో కనిపించనున్నారన్న వార్తతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొణెని తీసుకున్నా, కొన్ని వివాదాల కారణంగా ఆమెను తప్పించి, యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రిని ఫైనల్ చేశారు. మరోవైపు హీరోకి ఫాదర్‌గా చిరంజీవి పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్న రూమర్స్ ఫ్యాన్స్‌కి మాస్ జోష్ తెచ్చాయి.

ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసిన సందీప్ వంగా, విదేశాల్లో హై యాక్షన్ ఎపిసోడ్‌ల కోసం లొకేషన్లు ఫిక్స్ చేశాడట. తాజా సమాచారం ప్రకారం, నవంబర్ 5న షూటింగ్ గ్రాండ్‌గా స్టార్ట్ కానుంది. త్రిప్తి, చిరంజీవి, సంజయ్ దత్‌తో సెట్ చేసిన స్ట్రాంగ్ క్యాస్టింగ్‌లో మరో షాకింగ్ ఎంట్రీ ఉండబోతోందట. ఆమె ఇంకెవరో కాదు – మలయాళ ముద్దుగుమ్మ మడోన్నా సెబాస్టియన్. ‘శ్యామ్ సింగరాయ్’లో న్యాయవాదిగా, ‘లియో’లో విజయ్ చెల్లెలుగా అదరగొట్టిన మడోన్నా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించబోతున్నారని టాక్. మొదట ఈ రోల్ కోసం కరీనా కపూర్ని పరిగణనలోకి తీసుకున్నా, చివరికి మడోన్నాకే ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది. ఆమె సెకండ్ హీరోయిన్‌గా వస్తుందా లేక విలన్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తుందా అన్నది ఇంకా క్లారిటీ రాలేదు.

ఇక మరోవైపు, ప్రభాస్మారుతి కాంబినేషన్లో వస్తున్న ది రాజా సాబ్ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయింది. ఇందులో ప్రభాస్ కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్, హారర్ ఎలిమెంట్స్ చూసి ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ అయ్యారు. అయితే కొంతమంది నెటిజన్లు వీఎఫ్ఎక్స్‌ మీద ఇంకా ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న రిలీజ్ కానుంది. మొత్తానికి ప్రభాస్ వరుస అప్‌డేట్‌లతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. స్పిరిట్తో పవర్‌ఫుల్ కాపు ఆఫీసర్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్న ప్రభాస్చిరంజీవి కాంబినేషన్‌తో మాస్ ఫ్యాన్స్‌కి పండగ కానుందని చెప్పడంలో సందేహమే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: