
రాష్ట్రంలో అన్ని నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉండేటువంటి 50 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఇళ్ల నిర్మాణదారులు కేవలం ఒక్క రూపాయి ఫీజు చెల్లిస్తే చాలు ఇంటి నిర్మాణానికి అనుమాతులు లభిస్తాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అటు ప్రజలకు ఆనందం కలిగించిన ప్రతి ఏటా కూడా రూ .6 కోట్ల రూపాయలు అదనపు భారం చేరుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 123 మున్సిపల్ కార్పొరేషన్లు, నగర పంచాయతీలలో , మున్సిపాలిటీలలో ఈ విధానాన్ని అమలులోకి తీసుకువచ్చేలా ఉత్తర్వులను జారీ చేసింది.
ఇళ్ల నిర్మాణానికి మాత్రమే ఒక్క రూపాయి ఫీజు వర్తిస్తుంది. వాణిజ్య అవసరాల కోసం ఎవరైనా చేపడితే మాత్రం ఇది వర్తించదు అంటూ తెలియజేశారు. ముఖ్యంగా 50 చదరపు గజాల స్థలంలో దుకాణాలు కానీ, షెటర్లు నిర్మించాలనుకునే వారికి ఈ రూపాయి ఫీజు వర్తించదు. అలాగే లిటికేషన్ ఉన్న స్థలాలకు సంబంధించి ఈ సౌకర్యాన్ని తొలగించింది ఏపీ ప్రభుత్వం. గతంలో రూ .3000 రూపాయలుగా ఉన్న ఈ ఇంటి నిర్మాణం ఫీజు, ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కేవలం ఒక్క రూపాయికే తగ్గిపోయింది. కేవలం ఇంటి నిర్మాణానికి సంబంధించి డాక్యుమెంట్స్ ని ఆన్లైన్ లో అప్లోడ్ చేసి రూపాయి ఫీజు చెల్లిస్తే చాలు అంటూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.