
ఇండస్ట్రీలో ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్న ఈ చర్చ వెనుక కారణం చాలా స్పెషల్. మనందరికీ తెలిసిందే, సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించిన తాజా బిగ్ ప్రాజెక్ట్ ఓజీ – ఓజాస్ గంబీర్. ఈ సినిమా కేవలం బ్లాక్‌బస్టర్ మాత్రమే కాకుండా, పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన హిస్టారికల్ మూవీగా రికార్డు సృష్టించింది. థియేటర్లలో ఇంకా విజయవంతంగా ముందుకు సాగుతూ, ఒక్కో షోతో కొత్త రికార్డులు నమోదు చేస్తూ, ఓజీ ఇప్పటికే పవన్ కెరీర్ లో టాప్ మోస్ట్ మూవీగా నిలిచింది.
ఇంతలోనే, ఇటీవల విడుదలైన ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్ ఫ్యాన్స్‌లో ఎనలేని ఉత్సాహాన్ని రేపింది. మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రభాస్ కెరీర్‌లో పూర్తిగా కొత్త రకం ఎంటర్టైన్మెంట్‌ను అందించబోతుందనే అంచనాలు ఉన్నాయి. ప్రభాస్‌ని మాస్ యాక్షన్ లేదా పీరియడ్ జానర్‌లో చూసిన ప్రేక్షకులు, ఈసారి ఆయన కామెడీ యాంగిల్‌ను చూస్తున్నప్పుడు సర్ ప్రైజ్ అయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ చెబుతున్నారు. అదే సమయంలో, పవన్ కళ్యాణ్ ఓజీలో ఫ్యాన్స్ ఎలాగైతే తమ హీరోని వేరే స్థాయిలో చూశారో, అలాగే ప్రభాస్‌ని కూడా రాజా సాబ్ లో చూడబోతున్నామని అభిమానులు లింక్ పెడుతున్నారు. సుజీత్ పవన్ కళ్యాణ్‌కి డై-హార్డ్ ఫ్యాన్ అయితే, మారుతి మాత్రం ప్రభాస్‌కి పిచ్చి ఫ్యాన్ అని ఇండస్ట్రీలో టాక్. తమ హీరోను ఎలాగా చూపించాలి, జనాలు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు అన్నది ఇద్దరు డైరెక్టర్లు బాగా అర్థం చేసుకొని సినిమాలు తెరకెక్కించారనేది ఇప్పుడు హాట్ టాపిక్.
దాంతో సోషల్ మీడియాలో ఒక కంపారిజన్ క్రేజ్ స్టార్ట్ అయింది. పవన్ కళ్యాణ్‌కి ఓజీ ఎలాగైతే టర్నింగ్ పాయింట్ అయిందో, అలాగే ప్రభాస్‌కి రాజా సాబ్ కూడా అవుతుందని ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ఈ లింక్ వైరల్ అవుతూ, కుర్రాళ్లు మీమ్స్, ఎడిట్స్ చేస్తూ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఓజీ సెన్సేషన్ అయితే, ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్ కూడా అదే స్థాయిలో హీట్ క్రియేట్ చేస్తోంది. ఈ రెండు సినిమాలు కేవలం హీరోల కెరీర్‌కే కాకుండా, ఫ్యాన్స్ హృదయాల్లో కూడా ప్రత్యేక స్థానాన్ని సంపాదించబోతున్నాయి అనే నమ్మకం స్పష్టంగా కనిపిస్తోంది.