సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు . కానీ కొంతమంది మాత్రమే ప్రేక్షకుల మనసులను గలుచుకోగలరు . అలా గలుచుకున్న వారిలో కీర్తి సురేష్ కూడా ఒకరు . మన సౌత్ ఇండస్ట్రీలో హోమ్లీ లుక్ లో కనిపించిన భామలు బాలీవుడ్ లో ఫుల్ గ్లామర్ రోల్స్ చేస్తున్నారు . అలా చేస్తున్న వారిలో కీర్తి సురేష్ కూడా ఒకరు . మహానటిగా టాలీవుడ్ ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో ఉన్నంతసేపు నో గ్లామర్ మరియు నో లిప్ కిస్ పర్ఫామెన్స్ లతో కెరీర్ నడుపుతుంది. ఎప్పుడైతే బాలీవుడ్ బాట పట్టిందో మేడమ్ రూటే మారింది . వరుణ్ ధావన్ ఎన్నడూ చూడని కీర్తిని చూసి ఆశ్చర్యపోతున్నారు సౌత్ ఆడియన్స్ .


బేబీ జాన్ లో మాత్రమే కాదు బాలీవుడ్ వెబ్ సిరీస్ లో కూడా సీరియస్ ప్లస్ గ్లామరస్ లుక్ లోనే కనిపించబోతుందని టాక్ వినిపిస్తుంది . ఫస్ట్ లుక్ వచ్చి 7 నెలలు అవుతున్నా ఈ వెబ్ సిరీస్ నుంచి ఎటువంటి అప్డేట్ అందడం లేదు . ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుందో క్లారిటీ కూడా లేదు. కానీ సౌత్ లో మాత్రం అదే హోమ్లీ లుక్ మెయింటైన్ చేస్తుంది ఈ ముద్దుగుమ్మ . ఇకపై ఇక్కడ కూడా ఇదే తరహా రాబోతున్నట్లు టాక్ నడుస్తుంది . విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధనలో కీర్తి ఫైనల్ అయిందని టాక్ . ఇందులో కాస్త హద్దులు దాటుతుంది కూడా నట . విజయ్ దేవరకొండ తో కీర్తి లిప్ సీన్స్ లో నటించబోతున్నట్లు న్యూస్ వినిపిస్తుంది .


నిజానికి ఈ ఆఫర్ తొలుత రుక్మిణి వసంత్ వద్దకు వెళ్ళిందట . ఇప్పటివరకు గ్లామర్ రోల్ చేయని రుక్మిణికి లిప్ కిస్ అనగానే ఆఫర్ వదులుకున్నట్లు తెలుస్తుంది . అయితే కీర్తి మాత్రం ఎటువంటి అభ్యంతరం చెప్పకుండానే ఈ మూవీకి సాయం చేసినట్లు మూవీ వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి . పెళ్లయిన తరువాతే కీర్తి ఈ నిర్ణయం తీసుకోవడం నిజంగా ఆశ్చర్యకరంగా మారింది . దసరా రోజు గ్రాండ్ గా స్టార్ట్ కాబోతున్న రౌడీ మూవీలో కీర్తి సురేష్ ఎటువంటి అందాలు వలకబోయెను ఉందో చూడాలి . ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: