
ఒకప్పుడు “కోహ్లీ లేకుండా గెలవలేం”, “రోహిత్ లేకుండా పవర్ ప్లే వృథా” అనేవాళ్లు, ఇప్పుడు అభిషేక్ శర్మ, శుభమన్ గిల్, తిలక్ వర్మ, శివమ్ దూబే బ్యాటింగ్ చూసి ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ కుర్రాళ్లు ఆడే విధానం చూస్తే – ఎలాంటి భయం లేకుండా ఫ్రీగా, పవర్ తో ఆడేస్తున్నారు. తిలక్ వర్మ సిక్స్ లు, అభిషేక్ శర్మ దూకుడు, శుభమన్ గిల్ క్లాసీ షాట్లు, శివమ్ దూబే హిట్టింగ్ – ఇవన్నీ కలిపి ఒక కొత్త యుగం ప్రారంభమైందని చెప్పక తప్పదు. ఒకప్పుడు రోహిత్, కోహ్లీ ఇచ్చిన భరోసానే ఇప్పుడు ఈ కుర్రాళ్లు అందిస్తున్నారు. నిజానికి, ఈ ఇద్దరు సీనియర్లు దేశానికి ఇచ్చిన సర్వీస్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వందల కొద్దీ మ్యాచ్ లలో టీం ఇండియా గెలిచింది అంటే దానికి రోహిత్, కోహ్లీ లు కారణమని ఎవరూ మర్చిపోలేరు.
కానీ నిజం ఏమిటంటే – ఇప్పుడు వారిని రీప్లేస్ చేసే జూనియర్లు రెడీ అయ్యారు. మ్యాచ్ లు గెలిపించే మైండ్‌సెట్, ప్యాషన్, ఆగ్రెసివ్ గేమ్ ప్లే అన్నీ వీరిలో కనిపిస్తున్నాయి. ఆసియా కప్ లో తిలక్ వర్మ ఆడిన ఇన్నింగ్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్ మైండ్‌లో ఒక్క మాటే – “మరో కోహ్లీ దొరికాడు!” ఇక అభిషేక్ శర్మ బ్యాటింగ్ చూసిన తర్వాత “రోహిత్ కు రీప్లేస్ దొరికింది!” అని అంటున్నారు.మొత్తానికి, టీం ఇండియా ఇప్పుడు సూపర్ ఫేజ్ లో ఉంది. సీనియర్ల లేని లోటు అనేది అసలు లేనట్టే అనిపిస్తోంది. బదులు, కొత్త తరం ఆటగాళ్లు వచ్చి మైదానంలో “మనకే గెలుపు” అనే జోష్ ని తీసుకొచ్చారు. అందుకే క్రికెట్ ఫ్యాన్స్ ఒక్కటే చెబుతున్నారు – “డోంట్ వర్రీ.. బీ హ్యాపీ.. మన టీమ్ ఇండియాకు తిరుగులేదు.. ఎదురులేదు..!”