మెగాస్టార్ చిరంజీవి మన అందరికీ సుపరిచితమే . వరస ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు చిరు . ప్రెసెంట్ 70 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి తన స్క్రీన్ ప్రాజెక్ట్ మరియు మాస్ ఆపిల్ తో యంగ్ హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నాడని చెప్పుకోవచ్చు . విశ్వంభరా మరియు మన శంకర్ ప్రసాద్ గారు తో ఇప్పటికే అభిమానులను ఉత్సాహపరిచాడు చిరు . ఇక ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టును డైరెక్టర్ బాబి తో లైన్ లో పెట్టాడు . ఇది చిరంజీవి 158వ చిత్రంగా రూపొందుతుంది . ఇక టాప్ ప్రకారం ఈ చిత్రంలో హీరోయిన్ గా అనుష్క శెట్టి ని తీసుకున్నారని సమాచారం అందుతుంది .


అనుష్క కూడా ఈ ఆఫర్ పై పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి . చిరుత కలిసి స్క్రీన్ షేర్ చేయాలని అనుష్క చాలా కాలంగా కోరుకుంటున్నారట . ఆమె గతంలో మీడియా ముందు కూడా చిరంజీవితో నటించాలన్న కోరిక ఉంది అని తెలిపింది . తెలుగులో స్టార్ హీరోల అందరితోను నటించి టాప్ హీరోయిన్గా కొనసాగుతున్న అనుష్క చిరంజీవితో మాత్రం నటించలేదు . ఈ కాంబినేషన్ నిజమైతే అభిమానులకి పండగనే చెప్పుకోవచ్చు . ప్రెసెంట్ ఈ వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది .


ప్రస్తుతం రిలీజ్ అయిన పోస్టర్లో రక్తంతో తడిసిన గొడ్డలి మరియు రక్తంతో నిండిన బ్యాక్ గ్రౌండ్ చూపించబడింది . వాలైరు వీరయ్యగా చిరంజీవి ఓరా మాస్ గెటప్ లో చూపించిన బాబి.. ఈసారి ఏం ప్లాన్ చేశాడని మెగా ఫాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . ఆయన పాత్ర డిజైన్ లోనే కాదు క్యాస్టింగ్ విషయంలోనూ బాబీ జాగ్రత్తలు తీసుకుంటున్నాడట . అయితే కాకుండా మిరాయితో విలన్ గా అదరగొట్టిన మనోజ్ ఈ చిత్రంలో విలన్ గా పోషించనున్నట్లు ఫిలింనగర్ లో వార్తలు నడుస్తున్నాయి. మరి ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియాలంటే బాబీస్ స్పందించాలి .

మరింత సమాచారం తెలుసుకోండి: