తెలుగు ఇండస్ట్రీలోని ప్రముఖ యాంకర్లలో అనసూయ కూడా ఒకరు. జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు పొందినటువంటి అనసూయ ఇండస్ట్రీలో స్టార్ నటి కావడానికి ప్రధాన కారకుడు డైరెక్టర్ సుకుమార్ అని చెప్పుకోవచ్చు..ఈయన రంగస్థలం సినిమాను రామ్ చరణ్ ను హీరోగా పెట్టి అద్భుతంగా తెరకెక్కించారు. ఇందులో అనసూయ పాత్ర మాత్రం మరింత హైలెట్ అని చెప్పవచ్చు.. ఈ పాత్ర పేరు రంగమ్మత్త.. ఈ సినిమాలో అనసూయ చేయడానికి ముందు తన లైఫ్ ఒక విధంగా ఉంది. ఈ సినిమా చేసిన తర్వాత ఆమె లైఫ్ మరో విధంగా తయారయిందని చెప్పుకోవచ్చు. రంగమ్మత్త పాత్రలో అనసూయ నటించిన తీరు చూస్తే అందరూ ఆశ్చర్య పోవాల్సిందే. ఈ విధంగా అనసూయ ఈ పాత్రతో  ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సాధించింది.. 

ప్రస్తుతం ఆమె ఏ సినిమా షూటింగ్ కి వెళ్లినా ఇతర ఏదైనా ప్రాంతాలకు వెళ్లినా రంగమ్మత్త అని పిలుస్తారట.. ఇలా అనసూయ కెరియర్ ను రంగస్థలం మూవీ రంగమ్మత్త మార్చేసిందని  ఆమె కూడా చాలా సందర్భాల్లో చెప్పింది.. నిజానికి ఈ పాత్రలో ముందుగా అనసూయను తీసుకోలేదట. సుకుమార్ ముందు సీనియర్ హీరోయిన్ అయినటువంటి రాశిని సంప్రదించారట.. రంగమ్మత్త పాత్రలో రాశిని చేయాలని అడిగారట. కథ మొత్తం విన్న తర్వాత రాశి ఇలా చెప్పుకొచ్చిందట.. నేను ఎక్కువగా జనాల్లోకి సెంటిమెంటల్ కథలతోనే వెళ్లాను. నేను ఏడిస్తే ఏడ్చే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. నాది ఎక్కడికి వెళ్లినా కాస్త సింపతి ఫేస్ లా కనిపిస్తుంది. కానీ ఈ చిత్రంలో రంగమ్మత్త చాలా రగ్డ్ క్యారెక్టర్. అలాంటి పాత్రలో నేను చేయలేను..

 అంతేకాదు ఇందులో  అనసూయ చాలా అద్భుతంగా నటించింది. ఈ పాత్ర ఆమె కోసమే రాసినట్టుంది. అంతే కాదు ఇందులో వైన్ బాటిల్ తాగి అక్కడే పెడితే దాంట్లో మిగిలిన దాన్ని ఓపెన్ చేసి ఆమె తాగేసి వెళ్ళిపోతుంది.. అలాగే ఆమె బాత్రూంలో స్నానం చేసే సీన్లలో కూడా నటించింది.. ఇలాంటి సీన్లు నేను చేయలేనంటు రాశి రిజెక్ట్ చేసిందట. ఈ పాత్ర ఎప్పుడైతే రాశి కాదందో వెంటనే అది అనసూయకు చేరింది. కానీ ఇందులో ఆమె నటించడం కాదు జీవించిందని చెప్పవచ్చు. ఈ చిత్రం తర్వాత అనసూయ కెరియర్ మారిపోయింది. ఆమెకు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: