ప్రభాస్ ఇండస్ట్రీలోనే అత్యంత పొడవైన హీరోల్లో ఈయన ఒకరు.. తన పెదనాన్న  కృష్ణంరాజు  నట వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆయన కంటే ఎక్కువ పేరు సంపాదించుకున్నారు. అలాంటి ప్రభాస్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో వీడేంటి హీరోనా ఇలా ఉన్నాడంటూ చాలామంది వెక్కిరించారు. కానీ అవి పట్టించుకోకుండా ప్రభాస్ ముందుకు వెళ్లాడు.. మొదట్లో చేసిన ఒకటి రెండు సినిమాలు ఫ్లాప్ అయిన  తర్వాత వర్షం సినిమాతో ఒక హిట్ కొట్టారు. అదే ఊపులో రాజమౌళి డైరెక్షన్లో వచ్చినటువంటి ఛత్రపతి చిత్రంలో చేసి తనకంటూ ప్రత్యేకమైనటువంటి పేజీని తెలుగు ఇండస్ట్రీలో తయారు చేసుకున్నాడు. అప్పటి నుంచి ప్రభాస్ వెనక్కి తిరిగి చూసింది లేదు.. ఎప్పుడైతే రాజమౌళి చేతిలో పడ్డాడో ప్రభాస్ ను రాజమౌళి పాన్ ఇండియా స్టార్ ను చేశాడు. ప్రస్తుతం ప్రభాస్ ని అందుకోవడం తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో వల్ల అవ్వడం లేదు.. 

అలాంటి ప్రభాస్ ఛత్రపతి సినిమా తీసే సమయంలో ఒక పెద్ద కథ నడిచిందట.. ఛత్రపతి అని టైటిల్ పెట్టడానికి కారణం కూడా ఆ ఘటనే అని తెలుస్తోంది.. మరి ఆ ఘటన ఏంటి వివరాలు చూద్దాం.. ఛత్రపతి సినిమా వచ్చి 20 ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంగా ఆ సినిమా గురించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. దర్శకుడు రాజమౌళి ప్రభాస్ ను ఏదో ఒక రకంగా కొత్తగా చూపించాలని ఆలోచనలో పడ్డారు. ఇదే తరుణంలో తన పాత సినిమాలన్నింటిని చూస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అడవి రాముడు చిత్రంలోని ఒక ఎమోషనల్ సీన్ రాజమౌళిని కట్టిపడేసింది. దీంతో ఈ సినిమాలో ఎమోషనల్ ను బేస్ చేస్తూ సినిమా కథ తయారు చేశాడు. దీనికి యాక్షన్ సీక్వెన్స్ యాడ్ చేసి కథను అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఈ విధంగా రాజమౌళి ఆఫీసులో కథపై చర్చలు జరుగుతున్న సమయంలోనే  డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న ఒక వ్యక్తి కథ వింటూనే సార్ దీనికి ఛత్రపతి అని పెట్టండని అన్నాడట.

ఇంకేముంది ఈ టైటిల్ అందరికీ నచ్చేసింది వెంటనే ఈ సినిమాకు ఛత్రపతి అని నామకరణం చేసేసారు. ఈ విధంగా ఎమోషనల్ సెంటిమెంటుతో  పాటుగా యాక్షన్స్, సన్నివేషన్స్ ఈ సినిమాలో హైలెట్ గా నిలిచాయి. అంతేకాదు ప్రభాస్ ఒక రౌడీని చంపి శవాన్ని ఈడ్చికొచ్చి అప్పలనాయుడు అంటూ కోట శ్రీనివాసరావుకు వార్నింగ్ ఇచ్చే సీన్ జనాల మధ్య ఉంటుంది. అయితే ఈ సీన్ షూట్ సమయంలో జనాలు తన ముందు ఉండడం వల్ల కనీసం ప్రభాస్ కు డైలాగ్ చెప్పడానికి కూడా రాలేదట. కానీ ఆయన పెదవులు ఆడించి డైలాగ్ చెప్పినట్టు నటించారని తెలుస్తోంది. ఈ విధంగా వచ్చినటువంటి ప్రభాస్ ఛత్రపతి చిత్రం అప్పట్లో 54 థియేటర్లలో వంద రోజులకు పైగా ఆడి అద్భుత విజయాన్ని సాధించింది. ఇక ఈ సినిమా వచ్చి 20 సంవత్సరాలు కావడంతో మరోసారి ఈ విషయాన్ని అందరూ నెమరు వేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: