
ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన తాజా సినిమా ఓజి . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ సాధించి, పవన్ కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలిచింది. ప్రేక్షకులు కూడా "ఇలాంటి సినిమా పవన్ కెరీర్‌లో మళ్లీ రావడం కష్టమే" అని తెగ పొగడ్తలు కురిపిస్తున్నారు. కానీ ఈ సినిమాలో ఒక పెద్ద "లూప్" గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అదేంటంటే – పవన్ కళ్యాణ్ చిన్న వయసు పాత్రను చూపించాల్సిన సందర్భంలో, అఖీరానందన్‌ని తీసుకుని ఉంటే బావుండేదని చాలా మంది ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. పవన్ యంగ్ వర్షన్‌గా ఆయన స్క్రీన్‌పై కనిపించి ఉంటే ఫ్యాన్స్ కల నెరవేరిపోయేదని అంటున్నారు.అయితే వాస్తవం ఏమిటంటే, ఈ పాత్రలో అఖీరానందన్ కనిపించకపోవడానికి కారణం ఆయన పొడవు అని తెలుస్తోంది. తాజాగా ఆ సినిమాలో కీలకమైన యంగ్ పవన్ పాత్ర చేసిన యాక్టర్ ఆకాష్ శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో దీనిపై క్లారిటీ ఇచ్చారు.
ఆయన మాట్లాడుతూ – "ఓ జి సినిమాలో పవన్ గారి చిన్నప్పటి పాత్ర అఖీరా దగ్గర చేయించాలి అని చాలామంది అనుకున్నారు. కానీ ఆయన పొడవు ఎక్కువగా ఉండటం వల్లే ఆయనను తీసుకోలేదట. పవన్ యంగ్ వర్షన్ కంటిన్యూషన్‌కి ఇబ్బంది కలుగుతుందని డైరెక్టర్ సుజిత్ భావించారు. అందుకే ఆ పాత్రను నాకు ఆఫర్ చేశారు. నేను వెంటనే ఓకే చెప్పి ఆ పాత్ర చేశాను. ఆ రోల్ ద్వారా నాకు మంచి పేరు వచ్చింది." అని ఆకాష్ తెలిపారు.ఈ విషయం బయటకు రాగానే సోషల్ మీడియాలో తెగ వార్తలు వైరల్ అవుతున్నాయి. "అన్నీ ఉన్నా, ఒక్క హైట్ కారణంగా అఖీరాకి డ్యామేజ్ అవుతుందేమో" అంటూ ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, కొంతమంది దర్శకులు కూడా ఈ కారణంగానే అఖీరానందన్‌తో సినిమా డైరెక్ట్ చేయడానికి వెనుకడుగు వేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
అలాగే ఇండస్ట్రీలో హీరోయిన్స్ కూడా కొత్తగా ఎంట్రీ ఇవ్వకపోవడంతో, అఖీరా హైట్ కి మ్యాచ్ అయ్యే హీరోయిన్ కూడా లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆయన ఎప్పుడు సినిమాల్లోకి వస్తారన్న ప్రశ్నపై ఇంకా అనిశ్చితి నెలకొంది. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం ఒకే మాట అంటున్నారు – "హైట్ అన్నది నెగిటివ్ కాదు, పాజిటివ్‌గా మలుచుకోవచ్చు. అఖీ రాఎంట్రీ ఇచ్చే రోజే ఇండస్ట్రీలో సునామీ వస్తుంది." అంటున్నారు..!