కన్నడ స్టార్ నటలలో ఒకరు అయినటువంటి రిషబ్ శెట్టి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కేవలం నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. మూడు సంవత్సరాల క్రితం రిషబ్ శెట్టి తాను హీరోగా నటించి దర్శకత్వం వహించిన కాంతారా సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుందో మనందరికి తెలిసిందే. మొదట ఈ సినిమాను కన్నడ భాషలో విడుదల చేశారు. కన్నడ భాషలో ఈ సినిమాకి అద్భుతమైన టాక్ వచ్చింది.

దానితో ఈ సినిమాకి బీభత్సమైన కలెక్షన్లు వచ్చాయి. దానితో ఆ తర్వాత కొన్ని రోజులకు ఈ సినిమాను తెలుగుతో పాటు మరికొన్ని భాషలలో కూడా విడుదల చేశారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అనేక భాషలలో అందుకుంది. కాంతారా సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో కాంతారా చాప్టర్ 1 అనే పేరుతో మరో సినిమాను రూపొందించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో కూడా రిషబ్ శెట్టి హీరో గా నటించాడు. అలాగే ఈ మూవీ కి దర్శకత్వం కూడా వహించాడు. కాంతారా సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో మొదటి నుండి కూడా కాంతారావు చాప్టర్ 1  సినిమాపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక కాంతర చాప్టర్ 1 మూవీ ని స్టార్ట్ చేసినప్పటి నుండి ఈ మూవీ కాంతారా స్థాయిలో ప్రేక్షకులను మెప్పిస్తుందా ... ఈ సారి కూడా నటుడిగా , దర్శకుడిగా రిషబ్ శెట్టి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడా అనే ప్రశ్నలు జనాల్లో నెలకొస్తున్నాయి. అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా ఈ రోజు అనగా అక్టోబర్ 2 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షో లను నిన్న రాత్రి నుండే ప్రదర్శించారు. ఈ మూవీ ప్రీమియర్ షో లకు అద్భుతమైన పాజిటివ్ టాక్ వస్తుంది. కాంతారా సినిమా విషయంలో రిషబ్ శెట్టి  నటుడిగా , దర్శకుడిగా ఏ స్థాయిలో సక్సెస్ అయ్యాడో కాంతారా చాప్టర్ 1 విషయంలో కూడా అదే రేంజ్ లో సక్సెస్ అయ్యాడు అని అనేక మంది సినిమా చూసినవారు రివ్యూలను ఇస్తూ వస్తున్నారు. మరి కాంతారా చాప్టర్ 1 మూవీ ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: