గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పెద్ది అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. జాన్వి కపూర్మూవీ లో హీరోయిన్గా నటిస్తూ ఉండగా ... బుచ్చిబాబు సన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ లో శివరాజ్ కుమార్ , జగపతి బాబు , దివ్యాంధు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తూ ఉండగా ... వృద్ధి సినిమాస్ , మైత్రి సంస్థ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

మూవీ ని వచ్చే సంవత్సరం మార్చి 27 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొంత కాలం క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ ఓ చిన్న గ్లిమ్స్ వీడియోను , కొన్ని పోస్టర్లను విడుదల చేశారు. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ జనాలను లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ ఫస్ట్ సింగిల్ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటికే పెద్ది మూవీ కి సంబంధించిన ఫస్ట్ సింగిల్ రెడీ అయినట్లు తెలుస్తోంది. కానీ ఈ మూవీ లోని ఫస్ట్ సింగిల్ సాంగ్ షూటింగ్ కంప్లీట్ కాలేదు అని సమాచారం. దానితో ఈ మూవీ లోని ఫస్ట్ సింగిల్ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ మూవీ లిరికల్ వీడియోతో పాటు ఈ సాంగ్ వీడియోలోని కొన్ని సన్నివేశాలను కలిపి అప్పుడు ఈ మూవీ యొక్క ఫస్ట్ సింగిల్ ని విడుదల చేయాలి అని ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే పెద్ద సినిమా తర్వాత చరణ్ , సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇప్పటికే ఆ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: