ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా నిన్నటి రోజున ఆటో డ్రైవర్లకు "ఆటో డ్రైవర్ సర్వీస్ "సేవలో భాగంగా పథకాన్ని అమలు చేశారు. దీంతో ప్రతి ఏడాది కూడా రూ .15000 రూపాయలు ఇచ్చేలా కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేసింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ,నారా లోకేష్ తో పాటుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తో కలిసి ప్రారంభించారు. ఇలాంటి సందర్భంలోనే అటు నారా లోకేష్, సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఆటోలలో కూడా ప్రయాణం చేసి హైలెట్గా నిలిచారు.



కానీ నారా లోకేష్ ఆటోలో ప్రయాణం చేసి దిగినప్పుడు చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు. నారా లోకేష్ ఆటో డ్రైవర్ల సర్వీస్ పథకాన్ని ప్రారంభించే సందర్భంగా తన నియోజకవర్గ మంగళగిరిలో ఆటోలో  ప్రయాణించారు. లోకేష్ దగ్గరికి వచ్చేటప్పటికి మహిళ ఆటో డ్రైవర్ గా నడిపారు.. దిగిన తర్వాత నారా లోకేష్ తన జేబులో నుంచి ఆమెకు క్యాష్ తీసి ఇచ్చారు. సాధారణంగా ఇలాంటివి చేయడం చాలా తక్కువగా చూస్తుంటాం. అక్కడ కార్యకర్తలు ,నేతలు సైతం ఏర్పాటు చేస్తూ ఉంటారు.


కానీ నారా లోకేష్ తన జేబులో నుంచి డబ్బు ఇస్తూ ఉంటే ఆ మహిళా డ్రైవర్ వద్దని చెబుతున్న.. నారా లోకేష్ లేదమ్మా ఇది నీ డబ్బు నీ దగ్గరే  పెట్టుకో అంటూ డబ్బులు చేతికి ఇచ్చారు నారా లోకేష్. ఆ డబ్బులు తీసి ఇవ్వడం అనేది కూడా సంస్కారం. బాధ్యతాయుతమైనటువంటి తత్వం. పేదవాడి కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వాలన్నదే నారా లోకేష్ భావించారు. నారా లోకేష్ ఇదే కాకుండా ఇప్పటికే సహాయం అని అడిగిన ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పనులు చూసి చాలామంది కార్యకర్తలు, టిడిపి నేతలు కూడా నారా లోకేష్ చేస్తున్న పనులను ప్రశంసిస్తూ పొగడ్తలతో ముంచేస్తున్నారు. చంద్రబాబు తర్వాత ఆస్థానం నారా లోకేష్ కే దక్కుతుంది అంటూ మరి కొంతమంది తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: