స్టార్ హీరోయిన్ కాజల్ కి సంబంధించిన తాజా ఫోటో అభిమానులను ఆందోళనకు గురిచేస్తుంది. తాజాగా ముక్కులో ట్యూబ్ తో హాస్పిటల్లో ఉన్న కాజల్ అగర్వాల్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. మరి ఇంతకీ కాజల్ అగర్వాల్ కి ఏమైంది.. హాస్పిటల్ కి ఎందుకు వెళ్ళింది అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం.. సీనియర్ నటి కాజల్ అగర్వాల్ తాజాగా తన సోషల్ మీడియా ఖాతాలో హాస్పిటల్ బెడ్ పై ముక్కులో ట్యూబ్ చేతికి సెలైన్ ఉన్న ఫోటోని షేర్ చేసుకుంది. ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ గా మారడంతో చాలామంది కాజల్ అగర్వాల్ అభిమానులు ఇదేంటి కాజల్ కి ఏమైంది.. ఇలాంటి ఫోటో షేర్ చేసింది ఏంటి అని ఆందోళన చెందుతున్నారు. అయితే కాజల్ అగర్వాల్ ఆంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ కోసం అలా హాస్పిటల్ కి వెళ్లినట్టు తెలుస్తోంది.ఆమెకు ఏమీ కాలేదని, కేవలం ఆంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ కోసమే అలా వెళ్ళినట్టు అర్థమవుతుంది. 

ఇక ఈ మధ్యకాలంలో చాలా మంది సీనియర్ నటీమణులు  ఇలాగే ఆంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ ని తీసుకుంటున్నారు. అలా తాజాగా కాజల్ అగర్వాల్ కూడా యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫోటోని తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేయడంతో చాలామంది ఆమె ఫ్యాన్స్ ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు. అయితే కొంతమందేమో ఇది ఆంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ అని అంటే మరి కొంతమందేమో కాదు కాదు కాజల్ అగర్వాల్ కి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చింది అని కామెంట్స్ పెడుతున్నారు.ఇక కాజల్ అగర్వాల్ దీపావళి పండుగకు ముందు తన వెల్నెస్ దిన చర్యలో భాగంగానే ఇలా ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు అర్థమవుతుంది.

ఏది ఏమైనప్పటికి కాజల్ అగర్వాల్ ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతోనే చాలామంది ఆందోళనకి గురయ్యారు.ఆమె ఆరోగ్యంగానే ఉన్నారా అనే అనుమానాలు వారిలో ఉన్నాయి. ఇక కాజల్ అగర్వాల్ సినిమాల విషయానికొస్తే..గత ఏడాది భారతీయుడు 2 మూవీలో నటించినప్పటికీ ఆ పాత్రకు అంతగా స్కోప్ లేకపోవడంతో కాజల్ కి ఆ సినిమా కలిసి రాలేదని చెప్పుకోవచ్చు. అలాగే మంచు విష్ణు నటించిన కన్నప్ప మూవీ లో పార్వతి దేవి పాత్రలో కనిపించింది. కానీ ఈ సినిమా కూడా కాజల్ అగర్వాల్ కెరీర్ కి ప్లస్ అయితే కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: