తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఒక అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. ఈయన దర్శకుడిగా కెరియర్ను ప్రారంభించక ముందు అనేక సినిమాలకు కథ రచయితగా పని చేశాడు. ఈయన కళ్యాణ్ రామ్ హీరో గా రూపొందిన పటాస్ అనే సినిమాతో దర్శకుడిగా కెరియర్ను మొదలు పెట్టి మొదటి సినిమాతోనే సక్సెస్ను అందుకున్నాడు. ఆ తరువాత ఈయన దర్శకత్వంలో రూపొందిన సుప్రీమ్ , రాజా ది గ్రేట్ , సరిలేరు నీకెవ్వరు , ఎఫ్ 3 , భగవంత్ కేసరి , సంక్రాంతికి వస్తున్నాం అన్ని సినిమాలు కూడా మంచి విజయాలను అందుకున్నాయి.

ఈయన దర్శకత్వంలో రూపొందిన ప్రతి సినిమా కూడా బాక్సా ఫీస్ దగ్గర సక్సెస్ కావడంతో ఈయనకు అద్భుతమైన క్రేజ్ ఉంది. అనిల్ రావిపుడి ఆఖరుగా విక్టరీ వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను రూపొందించాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించింది. ఈ సినిమా నుండి మొదట గోదారి గట్టు అంటూ సాగే సాంగ్ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సాంగ్ అద్భుతమైన రేంజ్ లో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సాంగ్ ద్వారా కూడా సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అనిల్ రావిపూడి , చిరంజీవి హీరోగా రూపొందుతున్న మన శంకర వర ప్రసాద్ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ సినిమా నుండి తాజాగా మీసాల పిల్ల అంటూ సాగే సాంగ్ను విడుదల చేశారు. ఈ సాంగ్ కూడా గోదారి గట్టు సాంగ్ రేంజ్ లో సక్సెస్ అయ్యింది. ఇప్పటికే ఈ సాంగ్కు 25 ప్లస్ మిలియన్ వ్యూస్ కూడా దక్కాయి. ఇప్పటికే ఈ సాంగ్ సూపర్ సక్సెస్ కావడంతో మూవీ కూడా సక్సెస్ అయితే అనిల్ రావిపూడి మరో హిట్ను అందుకొని తన ఫామ్ ను అలాగే కంటిన్యూ చేస్తాడు అని చాలా మంది అభిప్రాయ పడుతున్నా రు.

మరింత సమాచారం తెలుసుకోండి: