టాలీవుడ్ యువ నటుడు కిరణ్ అబ్బవరం గురించి పరిచయం అవసరం లేదు. ఈయన రాజా వారు రాణి గారు అనే సినిమాతో హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడం తో ఈయనకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన నటించిన ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా కూడా మంచి విజయం సాధించడంతో ఈయన కు నటుడిగా మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈయన చాలా సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. అందులో వినరో భాగ్యము విష్ణు కథ సినిమాతో ఈయన కు మంచి విజయం దక్కింది. ఆ తర్వాత చాలా అపజయాలు ఈయనకు ఎదురయ్యాయి. అలాంటి సమయం లోనే ఈయన "క" అనే సినిమాలో హీరో గా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. క మూవీ తర్వాత ఈయన నటించిన దిల్ రూబ బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇది ఇలా ఉంటే తాజాగా కిరణ్ "కే ర్యాంపు" అనే సినిమాలో హీరో గా నటించాడు.

మూవీ తాజాగా థియేటర్లలో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర పరవాలేదు అనే స్థాయి టాక్ దక్కింది. ఈ మూవీ కి ప్రీమియర్స్ ద్వారానే యూ ఎస్ ఏ లో మంచి కలెక్షన్లు వచ్చాయి. తాజాగా ఈ మూవీ బృందం వారు యు ఎస్ ఎ లో ప్రీమియర్స్ ద్వారానే ఈ మూవీ కి 45069 గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇలా ఈ మూవీ కి యూ ఎస్ ఏ లో ప్రీమియర్ల ద్వారా మంచి కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ మూవీ తో కిరణ్ అబ్బవరం ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటాడో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: