తెలుగు సినిమా ఇండస్ట్రీలో పోటీ అన్నది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ప్రతి శుక్రవారం కొత్త సినిమా, కొత్త స్టార్, కొత్త ఎంట్రీ. ఇంతటి టఫ్ కాంపిటీషన్ మధ్య ఒక హీరో స్థిరంగా నిలబడటం అంటే అది చిన్న విషయం కాదు. కానీ ప్రభాస్ మాత్రం ఈ పోటీని ఎప్పుడూ పోటీలా తీసుకోలేదు — అదే అతని గొప్పతనం. ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుంది అంటే దానికి పోటీగా మరో రెండు లేదా మూడు స్టార్ సినిమాలు సిద్ధమవుతాయి. మార్కెట్ షేర్, బాక్స్ ఆఫీస్ రికార్డులు, ఓపెనింగ్స్ — ఇవన్నీ హీరోల మధ్య మామూలు రేసే. కానీ ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే మాత్రం ఆ డేట్ చుట్టూ అన్ని సినిమాలు వెనక్కి వెళ్లిపోతాయి. అందుకే ఫ్యాన్స్ గర్వంగా చెబుతారు — “ప్రభాస్ సినిమా వస్తే, ఇండస్ట్రీ ఆగిపోతుంది!” అని. కానీ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే — ఇంతవరకు ప్రభాస్ ఒక్కసారి కూడా “నా సినిమా ఉంది, మీది పోస్ట్ పోన్ చేసుకోండి” అని ఎవరికీ చెప్పలేదు. తన సినిమా రిలీజ్ డేట్ కోసం వేరే హీరో సినిమాని వెనక్కి తిప్పమని అడిగిన దాఖలాలు ఒక్కసారి కూడా లేవు. ఇది ప్రభాస్ మనసు ఎంత పెద్దదో చూపించే నిజమైన ఉదాహరణ. మిగతా స్టార్ హీరోలు చాలా సార్లు ఇలాంటి సిట్యుయేషన్లలో నిర్మాతలతో మాట్లాడి తమ సినిమాకి స్పేస్ తీసుకుంటే, ప్రభాస్ మాత్రం అలాంటి ఆటిట్యూడ్ ఎప్పుడూ చూపించలేదు.

ఈశ్వర్ సినిమాతో కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి కల్కి  వరకు — ప్రతి ప్రాజెక్ట్‌కి తన 100% డెడికేషన్ మాత్రమే ఇచ్చాడు. హిట్, ఫ్లాప్ అనే భావనలకు అతనికి పెద్దగా అర్థం ఉండదు. స్క్రిప్ట్ నచ్చితే చాలు, బడ్జెట్ ఎంతైనా సరే, రిస్క్ ఎంతైనా సరే — కథ కోసం తనను పూర్తిగా అర్పించేస్తాడు. ప్రభాస్ వ్యక్తిత్వం గురించి ఇండస్ట్రీలో అందరూ చెప్పే ఒక మాట ఉంది —“అతను మాట్లాడడు కానీ, అతని సైలెన్స్‌కి కూడా గౌరవం ఉంటుంది.”. సెట్‌లో ఆయన ప్రవర్తన ఎప్పుడూ సింపుల్‌గా ఉంటుంది. కో-స్టార్స్‌తో ఎప్పుడూ హుందాగా, కూల్‌గా ఉంటాడు. హీరోయిన్ సీన్స్‌లోనూ, యాక్షన్ సీన్స్‌లోనూ ఎలాంటి అటిట్యూడ్ ఉండదు. హీరోయిన్ పక్కన ఎన్ని షాట్స్ తీసినా, ఎన్ని రీటేక్స్ అయినా — ఆయన ఫిర్యాదు ఒక్క మాటా ఉండదు. ఇంకా ముఖ్యంగా — కాంట్రోవర్సీలు అన్న పదమే ప్రభాస్‌కి దూరం. ఇండస్ట్రీలో ఎన్ని గాసిప్స్ వచ్చినా, ఎన్ని రూమర్స్ పుట్టినా ఆయన ఎప్పుడూ సైలెంట్‌గా ఉంటాడు. ఇటీవల దీపికా పదుకొణెతో  కల్కి 2 ఇష్యూ సమయంలో కూడా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. మీడియాలో ఎన్నో వదంతులు పుట్టాయి, సోషల్ మీడియాలో అనవసర చర్చలు జరిగాయి. కానీ ప్రభాస్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బదులుగా ఆయన వర్క్‌పైనే దృష్టి పెట్టాడు. అదే ఆయన స్వభావం — ‘‘Talk less, work more.’

ఇప్పుడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎమోషనల్‌గా పోస్ట్‌లు చేస్తున్నారు. #HappyBirthdayPrabhas ట్రెండ్ అవుతుంది. ఆయనలోని వినయం, హ్యూమిలిటీ, సింప్లిసిటీ గురించి ప్రపంచం మాట్లాడుతోంది. ప్రభాస్ అభిమానులు గర్వంగా చెబుతున్నారు –“మన హీరోకు అహంకారం లేదు, గౌరవమే ఉంది. అందుకే ఆయనను ఇండస్ట్రీ కాదు, ప్రపంచం సెలబ్రేట్ చేస్తుంది!”. ‘డార్లింగ్’ అనే పేరు ఆయనకు కేవలం సినిమా టైటిల్ కాదు – అది ఆయన వ్యక్తిత్వానికి ఇచ్చిన గుర్తింపు. అందుకే ఫ్యాన్స్ ఆయనను రెబల్ స్టార్, డార్లింగ్ ప్రభాస్, ది గేమ్ ఛేంజర్ ఆఫ్ ఇండియన్ సినెమా అని పిలుస్తారు. ఇండస్ట్రీలో ఎన్ని స్టార్ హీరోలు వచ్చినా, ఎవరి రికార్డులు ఎంత ఉన్నా –ఒక మాట మాత్రం నిజం —“సైలెంట్‌గా పాన్  ఇండియా లెవెల్‌లో ఇంతటి రేంజ్ సాధించిన స్టార్ మన ప్రభాస్ ఒక్కరే!” హ్యాపీ బర్త్‌డే టు ది రియల్ జెంటిల్ మ్యాన్  ఆఫ్ ఇండియన్ సినిమా – మన డార్లింగ్ ప్రభాస్ ..!!


మరింత సమాచారం తెలుసుకోండి: