
ఖర్గే వంటి నిజాయితీ పరుడైన నాయకుడి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వార్తలు రాయడం దారుణమని ఆయన స్పష్టం చేశారు. ఈ పత్రిక తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఎవరో పోర్టల్‌లో వచ్చిన వార్తను స్క్రిప్ట్ రైటర్లతో వండి ప్రచురించడం సిగ్గుమాలిన చర్య అని దయాకర్ విమర్శించారు. మీడియాపై మా ప్రభుత్వానికి పూర్తి గౌరవం ఉందని చెప్పగా గతంలో కేసీఆర్ కొన్ని ఛానళ్లను బ్యాన్ చేసి బెదిరించాడని గుర్తు చేశారు.
పార్టీ పేరు మార్చుకున్న బీఆర్ఎస్ పత్రిక పేరును భారత్‌గా మార్చలేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఈ పత్రికను విష పత్రికగా మార్చి కేటీఆర్ గొంతుగా తయారు చేశాడని ఆరోపణ చేశారు. ముసుగు దొంగల్లా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దయాకర్ ఆక్షేపించారు.
బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా పతనమైందని దయాకర్ స్పష్టం చేశారు. ఒకటి కాదు రెండు కాదు నాలుగు ముక్కలైన పార్టీగా మారిందని విమర్శించారు. కేసీఆర్ చవకబారు వ్యవహారాలను తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో బీఆర్ఎస్‌కు అధికారం దూరమేనని అంచనా వేశారు. తప్పుడు వార్తలు రాస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు.
కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంగా నిజాయితీతో పనిచేసే మీడియాను సమర్థిస్తుందని దయాకర్ తెలిపారు. తప్పుడు ప్రచారాలు జర్నలిజం స్థాయిని కిందపడేస్తాయని హెచ్చరించారు. ఈ ఘటన రాజకీయ పార్టీల మధ్య మీడియా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది.
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు